సాక్షి, న్యూఢిల్లీ: వరుస పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు. గతవారంతో పోలిస్తే కేరళలో 68శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.
చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన వీరు ఏం చేస్తున్నారో తెలుసా?
ముఖ్యంగా కేరళలో కరోనా విజృంభణపై రాజేశ్ భూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని గుర్తుచేశారు. ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు. కాగా దేశంలో కరోనా కేసుల వివరాలు వెల్లడించారు. 24 గంటల్లో 43,263 కొత్తగా కేసులు నమోదయ్యాయని, 338 మంది మృతి చెందారని తెలిపారు. అయితే ఆ కేసుల్లో ఒక్క కేరళలోనే 30,196 పాజిటివ్ కేసులు, 181 మృతులు సంభవించాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment