
చేసేది దేశభక్తి సినిమాలు.. చెప్పేది ఓటు ఎంతో శక్తిమంతమైనదని నీతులు.. కానీ తీరా పోలింగ్‌నాడు ఆయన కనిపించనే లేదు. వేలికి సిరా గుర్తు పెట్టుకొని.. గర్వంగా ఫొటో దిగలేదు. తోటి సినీ స్టార్లు పెద్ద ఎత్తున కదిలివచ్చి ఓటు వేసినా.. ఆయన మాత్రం ఇంటికి పరిమితమయ్యారు. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజకీయేతర వ్యక్తిగత ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
కేసరి, టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్‌కథా, ఎయిర్‌లిఫ్ట్ వంటి దేశభక్తి మేళవించిన కథలతో వరుసగా సూపర్‌హిట్లు కొడుతున్న అక్షయ్‌కుమార్ తాజాగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. విచిత్రమేమిటంటే.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలంటూ ట్విటర్‌లో విజ్ఞప్తి చేస్తూ.. ట్యాగ్ చేసిన ప్రముఖుల్లో అక్షయ్‌కుమార్ కూడా ఉన్నారు. అంతేకాకుండా మోదీ ట్వీట్‌కు బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తిమంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్ చెప్పుకొచ్చారు. తీరా ఓటు వేయని ఆయన మంగళవారం ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని.. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఓటు ఎందుకు వేయలేదని మీడియా ప్రశ్నించగా చెలియే.. చెలియే.. (వదిలేయండి) అంటూ దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment