► 48 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు
► అవాంఛనీయ సంఘటనలు
► చోటుచేసుకోకుండా చర్యలు
గుణదల : ప్రొఫెషనల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే శుక్రవారం నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష) కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర్ గౌతం సవాంగ్ చెప్పారు. వన్‌టౌన్, టూ టౌన్, మాచవరం, సత్యనారాయణపురం, పాయకాపురం, నున్న, పెనమలూరు, సూర్యారావుపేట పరిధిలోని 48 పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకు జరిగే ఇంజినీరింగ్ విభాగానికి, మధ్నాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరుగుతున్న సమయంలో 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడినా, కర్రలు, రాళ్లు తదితర ఆయుధాలతో సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎంసెట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
Published Thu, Apr 28 2016 4:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement