సమావేశంలో మాట్లాడుతున్న పీఓ రవికుమార్
-
సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి రవికుమార్
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో కీలక భూమిక పోషించే నిర్వహణ కమిటీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి రవికుమార్ అన్నారు. గురువారం ఖమ్మం డైట్ కళాశాలలో ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఎస్‌ఎంసీల ఎన్నికలు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించాలని, 23వ తేదీలోగా జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో నివేదిక అందచేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ఎన్నికలు నిర్వహించాలని, మండల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, మధిర డిప్యూటీ ఈఓలు బస్వారావు, రాములు, ఇన్‌చార్జ్ సీఎంఓ రాధాకృష్ణ, సూపరింటెండెంట్ శేషగిరి, ఇన్‌చార్జ్ ఏఎంవో సుధాకర్, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.