
మేనేజ్‌మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు
1.
మేనేజ్‌మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు
ఎంవీపీకాలనీ/వెంకోజీపాలెం, మేనేజ్‌మెంట్ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు పే ర్కొన్నారు. ఎంవీపీకాలనీ సమత డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో సాక్షి దినపత్రిక, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మేనేజ్‌మెంట్ వి ద్యపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేనేజ్ మెం ట్‌కోర్సులతో పలు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశ, విదేశీ సంస్థల్లో మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తీసిపోకుండా మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నవారు కూడా మంచి వేతనాలు పొందుతున్నారని తెలిపారు. సమత కళాశాల లో మేనేజ్‌మెంట్‌విద్యార్థులకు నాణ్యమైన విద్య అం దిస్తున్నారని కొనియాడారు. సమత డి గ్రీ, పీజీ కళాశాల డెరైక్టర్ బి.మురళీకృష్ణ, అధ్యాపకు లు, పలు మేనేజ్‌మెంట్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.