సాక్షి, నిజామాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్.. చంద్రబాబు ధారాదత్తం చేసిన ఈ ఫ్యాక్టరీని దక్కించుకున్న యాజమాన్యం తాజా గా మరో ఎత్తుగడ వేస్తోందా? తమ ఫ్యాక్టరీని ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్పిం చి ప్రభుత్వం వచ్చే ప్రయోజనాలను కొట్టేసేం దుకు పావులు కదుపుతోందా..? పన్నుల మినహయింపులు, ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందేందుకు కిరణ్ సర్కారుపై ‘తమ దైనశైలి’ లో ఒత్తిడి తెస్తోందా? రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలను లోతుగా పరిశీలి స్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరున్న ఈ ఫ్యా క్టరీని 2002లో చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా నిలుస్తున్న ఈ కర్మాగారానికి బోధన్‌లో ప్రధాన యూనిట్ ఉండ గా, మెదక్ జిల్లా అంబోజీపేట్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిల్లో ఒక్కో యూనిట్ చొప్పున ఉన్నాయి.
పస్తుత రోజుల్లో సుమారు రూ. 500 నుంచి వెయ్యి కోట్ల ఆస్తిపాస్తులు కలిగిన ఈ కర్మాగారాన్ని చంద్రబాబు నామమాత్ర మొత్తానికి ప్రైవేటీకరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దీన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం శాసన సభాసంఘాన్ని వేశారు. ఇప్పుడు కిరణ్ సర్కారు మాత్రం ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యానికే మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌డీఎస్‌ఎల్‌ను బీఐ ఎఫ్‌ఆర్ (పరిశ్రమల పునర్ వ్యవస్థీకరణ బోర్డు) పరిధిలోకి చేర్చేందుకు కిరణ్ సర్కారు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో చర్చకొచ్చింది.
బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వస్తే ప్రయోజనాలు..
ఏదైనా కర్మాగారం బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వస్తే దాని కి ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయి. వ్యాట్ వంటి పన్నుల నుంచి తాత్కాలికంగానైనా మినహాయింపులుంటాయి. అదేవిధంగా విద్యు త్ చార్జిల్లో రాయితీలు పొందవచ్చు. వీటితో పాటు గా ఈ బోర్డు నుంచి ప్రత్యేక రుణాలు పొందడమే కాకుండా, వడ్డీ రాయితీలుంటాయి. ఈ ప్రయోజనాలను పొందేందుకు ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం ఈ కర్మాగారాన్ని నడపడంతో నష్టాల పాలవుతున్నామని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించిందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరుకు సాగు విస్తీర్ణం కూడా తగ్గిందని సర్కారు నివేదిక ఇచ్చిందని, విస్తీర్ణం తగ్గడానికి యాజమాన్యం ధోరణే కారణమని రైతులు వాపోతున్నారు. రైతుల ప్రయోజనాలు, ఈ ఫ్యాక్టరీ నిర్వహణ, కార్మికుల పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.
క్రషింగ్‌పై రైతుల్లో ఆందోళన
ఎన్‌డీఎస్‌ఎల్‌ను ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చితే ఈ కర్మాగారాన్ని మూసివేస్తారని చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ బీఐఎఫ్‌ఆర్ పరిధిలో వస్తే లాకౌట్ అయ్యే అవకాశాలు లేవని కేన్ కమిషన్ ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. వాస్తవానికి ఈ సీజనులో నవంబర్ 28 నుంచే చెరుకు క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ యాజమాన్యం ఈనెల రెండుకు వాయిదా వేసింది. అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడం తో రైతులు ఆందోళన బాట పట్టారు. గత గురువారం బోధన్ బంద్ నిర్వహించారు. చివరకు శనివా రం నుంచి ఫ్యాక్టరీ అధికారులు క్రషింగ్‌ను ప్రారంభించారు.
ఎన్‌డీఎస్‌ఎల్ ఖాయిలా?
Published Tue, Dec 10 2013 12:20 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement