nizam deccan sugars
-
నిజాం డెక్కన్ సుగర్స్ కార్మికుల ధర్నా
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని నిజాం డెక్కన్ సుగర్స్ లిమిటెడ్ కార్యాలయం వద్ద కంపెనీ పర్మినెంట్ కార్మికులు ధర్నా చేపట్టారు. అక్ర లేఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 51 శాతం కంపెనీ షేర్ హోల్డర్‌గా ఉన్న గోకరాజు గంగరాజు కార్యాలయాన్ని విజయవాడకు మార్చడంతో 300 కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
నిజాం దక్కన్ షుగర్స్‌లో తేలిన వాటాలు
♦ డెల్టా పేపర్ మిల్స్ ఈక్విటీ రూ.48.15 కోట్లు ♦ జాయింట్ వెంచర్ ఆస్తులు, అప్పుల మదింపు సాక్షి, హైదరాబాద్: నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నియమించిన ఎస్బీఐ క్యాప్స్ సంస్థ ఆస్తులు, అప్పులపై నివేదిక సమర్పించింది. ఈక్విటీ షేర్లు, ఇతర వాటాలు, రుణాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని మదింపు చేసి న ఎస్బీఐ క్యాబ్స్ భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్‌మిల్స్ వాటాను 58.67%గా తేల్చింది. ఈ లెక్కన రూ.48.15 కోట్ల ఈక్విటీని చెల్లిస్తే ఎన్డీఎస్ఎల్ను తిరిగి స్వాధీనం చేసుకునే వీలుంటుందని సిఫారసు చేసింది. సంయుక్త భాగస్వామ్య సంస్థ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్)లో ప్రస్తుతం నిజాం షుగ ర్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్), డెల్టా పేపర్‌మిల్స్ (డీపీఎం) భాగస్వాములుగా ఉన్నాయి. 2002 ఆగస్టు 28న ఈ రెండు భాగస్వామ్య సంస్థల నడుమ కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్ఎస్ఎల్ వాటా 49 శాతం కాగా, డీపీఎం వాటా 51 శాతం. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ నిర్వహణ బాధ్యతను డెల్టా పేపర్ మిల్స్ చేపట్టింది. కాగా నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 సీజన్ నుంచి చెరుకు క్రషింగ్ చేయలేమంటూ ఎన్డీఎస్ఎల్ భాగస్వామ్య సంస్థ డీపీఎం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఎల్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ‘కార్యదర్శుల కమిటీ’కి అప్పగించింది. ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు తదితరాలను మదింపు చేసే బాధ్యతను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్బీఐ క్యాపిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్) అనే సంస్థకు కార్యదర్శుల కమిటీ అప్పగించింది. -
మద్దతు కోసం రాస్తారోకో
చెరకు ‘మద్దతు’ కోసం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు రోడ్డెక్కారు.. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే ఎన్డీఎస్ఎల్లో కూడా టన్నుకు రూ. 2,600 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో చేపట్టారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదంటూ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో డీఎస్పీ రాజారత్నంతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆర్డీఓ నగేష్ హామీతో ఆందోళనకారులు శాంతించారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో గల నిజాం దక్కన్ షుగర్స్(ఎన్డీఎస్ఎల్)లో టన్ను చెరుకుకు రూ.2,600 మద్దతు ధర ఇవ్వాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని హౌస్ కమిటీ ద్వారా తీర్మానం చేసినట్లు తెలిపారు. 2013లో సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా చెరుకు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో సైతం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త ఆధీనంలో నడిచిందని ఏనాడు ఇతర ఫ్యాక్టరీల కన్నా తక్కువ ధర ఇచ్చిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించాలని ఎన్డీఎస్ఎల్ జీఎం నాగరాజును కోరారు. దీనిపై జీఎం స్పందిస్తూ.. మిగతా ఫ్యాక్టరీల మాదిరిగా తాము ధర ఇవ్వలేమని 2014 జూన్‌లోనే ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తే తప్ప ఇతర ఫ్యాక్టరీల మాదిరిగా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ సమాధానంతో మండిపడ్డ మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. గంటన్నరపాటు రాస్తారోకో... మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ముందుగల నర్సాపూర్ - మెదక్ ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా విరమించాలంటూ రూరల్ సీఐ రామకృష్ణ, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో మెదక్‌కు వస్తున్న డీఎస్పీ రాజరత్నం వాహనం దిగి సునీతాలక్ష్మారెడ్డి దగ్గరకు చేరుకున్నారు. రాస్తారోకోకు అనుమతి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆమె రైతులకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో వాహనాలను మాచవరం మీదుగా దారి మళ్లించాలని అక్కడే ఉన్న సీఐకి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులు ఆ రహదారిపై కూడా నిరసనకు దిగడంతో డీఎస్పీ, సునీతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ నగేష్‌గౌడ్‌కు ఫోన్ చేసిన రెవెన్యూ అధికారులు సునీతాలక్ష్మారెడ్డితో మాట్లాడించారు. సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిచారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టీపీసీసీ రాష్ట్రకార్యదర్శి సుప్రభాతరావు, సీడీసీ చైర్మన్ నరేంద్రరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిండ్ల ఆంజనేయులు, కొల్చారం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, నందారెడ్డి, నాయకులు బీమరి శ్రీనివాస్, కిషన్‌గౌడ్, మదుసుధన్‌రావు. నాగిరెడ్డి, హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
తెగని పంచాయితీ
‘నిజాం దక్కన్ షుగర్స్’ స్వాధీనంపై సర్కార్ మీనమేషాలు నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్య పంచాయితీ తగదు తెగడం లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ గతంలో టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో చెరుకు రైతులంతా ఆనందపడ్డారు. అయితే టీఆర్ఎస్ సర్కార్ పాలన చేపట్టి నెలదాటినా నిజాం దక్కన్ షుగర్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు క్రషింగ్ సీజన్ సమీపిస్తుండడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకుని బకాయిలు చెల్లించడంతో పాటు యంత్రాల మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మెదక్: నిజాం దక్కన్ షుగర్స్...జిల్లాలోని చెరుకు రైతుకు ప్రధాన ఆధారం. అందువల్లే ఈ పరిశ్రమను సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకోవాలో లేదో చెప్పాలంటూ గ్రూప్ అఫ్ మినిస్టర్స్‌తో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ చెరుకు రైతులతో మాట్లాడడంతో పాటు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని సిఫార్సు చేసినా, అది అమలుకు నోచుకోలేదు. అప్పట్లో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలంటూ ఉద్యమ బాట పట్టిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 40 రోజులు దాటినా ఫ్యాక్టరీ పంచాయతీ తెగలేదు. మరోవైపు చెరుకు సీజన్ దగ్గర పడుతున్నా యాజమాన్య హక్కులు తేలక.. మూలన పడ్డ మిషన్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రైతన్నలు గొంతెత్తి ఘోషించినా..జిల్లా క లెక్టర్ ఆదేశించినా..రూ 7.62 కోట్ల చెరుకు బకాయిలు చెల్లించడం లేదు. మెదక్ మండలం మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలంటూ 2014 జనవరి 7వ తేదీన చెరుకు రైతుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 2014 జనవరి 17న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అప్పటి ముఖ్యమంత్రి ఆమోదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చినా, అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అప్పట్లో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గులాబీదళం పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏర్పాటు కావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పాటు అనుకున్నట్లుగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు వెలువడుతాయని రైతులంతా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పట్లో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యానికి రూ. 234 కోట్లు ఇచ్చి ప్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకోవాలంటూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసు చేసినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వంలో యత్నాలు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని కోరుతూ చెరుకు రైతు పోరాట సమితి ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, రైతు నాయకులు నర్సింహారెడ్డిలు ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయన సూచన మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సచివాలయంలోని న్యాయ విభాగం సలహా తీసుకుంటూ డ్రాఫ్టింగ్ తయారు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో హైకోర్టులో రైతుసంఘం నాయకులు గత ప్రభుత్వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సును అమలు చేయాలంటూ అమెండ్మెంట్ ఆఫ్ పిటీషన్ వేశారు. అయితే ఈ పిటీషన్‌కు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ఆమోదాన్ని తెలుపుతూ పిటీషన్ వేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా సకాలంలో హైకోర్టు బెంచ్‌పైకి పిటీషన్ రాకపోవడంతో నిర్ణయం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో క్రషింగ్.. మరమ్మతులు ఎలా? ఈసారి చెరుకు క్రషింగ్ నవంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయినప్పటికీ ఫ్యాక్టరీలోని మిషన్లకు ఇప్పటి వరకు మరమ్మతులు ప్రారంభం కాలేదు. మరమ్మతులు చేయడానికి ఎంతలేదన్నా 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఫ్యాక్టరీ భవిష్యత్‌పై నిర్ణయం వెలువడక పోవడంతో ప్రైవేట్ యాజమాన్యం మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వపరం కాకపోవడంతో అటువైపు నుంచి కూడా మరమ్మతుల కోసం చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈసారి సుమారు 2 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. గత ఏడాది 1,53,731 టన్నుల చెరుకు క్రషింగ్ జరిగింది. ఈసారి ఎక్కువ మొత్తంలో చెరుకు ఉన్నందున త్వరగా మరమ్మతులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వ నిర్ణయం ఎంత త్వరగా వెలువడితే అంత త్వరగా మరమ్మతులు ప్రారంభమయ్యే అస్కారం ఉంది. గుదిబండగా మారిన బకాయిలు చెరుకు రైతులకు జూలై 7లోగా ఏడు విడుతల్లో మొత్తం బకాయిలు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఎదుట ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంది. కానీ ఇంత వరకు ఏడో విడత ద్వారా రావాల్సిన రూ.3.04 కోట్ల బకాయిలు చెల్లించలేదని చెరుకు రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి తెలిపారు. అలాగే బోనస్ కింద రూ.4.58 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, ఆయన ఇండస్ట్రీయల్ కామర్స్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రైతులకు మేలు చేయాలని నాగిరెడ్డి కోరారు. -
ఎన్డీఎస్ఎల్ ఖాయిలా?
సాక్షి, నిజామాబాద్: నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్.. చంద్రబాబు ధారాదత్తం చేసిన ఈ ఫ్యాక్టరీని దక్కించుకున్న యాజమాన్యం తాజా గా మరో ఎత్తుగడ వేస్తోందా? తమ ఫ్యాక్టరీని ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్పిం చి ప్రభుత్వం వచ్చే ప్రయోజనాలను కొట్టేసేం దుకు పావులు కదుపుతోందా..? పన్నుల మినహయింపులు, ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందేందుకు కిరణ్ సర్కారుపై ‘తమ దైనశైలి’ లో ఒత్తిడి తెస్తోందా? రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న తాజా పరిణామాలను లోతుగా పరిశీలి స్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరున్న ఈ ఫ్యా క్టరీని 2002లో చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా నిలుస్తున్న ఈ కర్మాగారానికి బోధన్‌లో ప్రధాన యూనిట్ ఉండ గా, మెదక్ జిల్లా అంబోజీపేట్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిల్లో ఒక్కో యూనిట్ చొప్పున ఉన్నాయి. పస్తుత రోజుల్లో సుమారు రూ. 500 నుంచి వెయ్యి కోట్ల ఆస్తిపాస్తులు కలిగిన ఈ కర్మాగారాన్ని చంద్రబాబు నామమాత్ర మొత్తానికి ప్రైవేటీకరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దీన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం శాసన సభాసంఘాన్ని వేశారు. ఇప్పుడు కిరణ్ సర్కారు మాత్రం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికే మేలు చేకూర్చేలా చర్యలు చేపడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్డీఎస్ఎల్ను బీఐ ఎఫ్ఆర్ (పరిశ్రమల పునర్ వ్యవస్థీకరణ బోర్డు) పరిధిలోకి చేర్చేందుకు కిరణ్ సర్కారు నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినేట్ సమావేశంలో చర్చకొచ్చింది. బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వస్తే ప్రయోజనాలు.. ఏదైనా కర్మాగారం బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వస్తే దాని కి ప్రభుత్వం నుంచి పలు ప్రయోజనాలు అందుతాయి. వ్యాట్ వంటి పన్నుల నుంచి తాత్కాలికంగానైనా మినహాయింపులుంటాయి. అదేవిధంగా విద్యు త్ చార్జిల్లో రాయితీలు పొందవచ్చు. వీటితో పాటు గా ఈ బోర్డు నుంచి ప్రత్యేక రుణాలు పొందడమే కాకుండా, వడ్డీ రాయితీలుంటాయి. ఈ ప్రయోజనాలను పొందేందుకు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ కర్మాగారాన్ని నడపడంతో నష్టాల పాలవుతున్నామని ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించిందని రైతులు ఆరోపిస్తున్నారు. చెరుకు సాగు విస్తీర్ణం కూడా తగ్గిందని సర్కారు నివేదిక ఇచ్చిందని, విస్తీర్ణం తగ్గడానికి యాజమాన్యం ధోరణే కారణమని రైతులు వాపోతున్నారు. రైతుల ప్రయోజనాలు, ఈ ఫ్యాక్టరీ నిర్వహణ, కార్మికుల పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. క్రషింగ్‌పై రైతుల్లో ఆందోళన ఎన్డీఎస్ఎల్ను ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చితే ఈ కర్మాగారాన్ని మూసివేస్తారని చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ బీఐఎఫ్ఆర్ పరిధిలో వస్తే లాకౌట్ అయ్యే అవకాశాలు లేవని కేన్ కమిషన్ ఉన్నతాధికారులు పేర్కొం టున్నారు. వాస్తవానికి ఈ సీజనులో నవంబర్ 28 నుంచే చెరుకు క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ యాజమాన్యం ఈనెల రెండుకు వాయిదా వేసింది. అయినా క్రషింగ్ ప్రారంభం కాకపోవడం తో రైతులు ఆందోళన బాట పట్టారు. గత గురువారం బోధన్ బంద్ నిర్వహించారు. చివరకు శనివా రం నుంచి ఫ్యాక్టరీ అధికారులు క్రషింగ్‌ను ప్రారంభించారు.