సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆస్పత్రుల పని తీరు, చికిత్స అందిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే తమకు ప్రభుత్వం విధించిన చార్జీలు సరిపోవడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన యాజమాన్యాలు విన్నవించాయి. చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో పాటు బెడ్స్ పరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరనున్నాయి. (చదవండి: సర్కారు, గవర్నర్.. ఓ కరోనా)
Comments
Please login to add a commentAdd a comment