
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝులిపించింది. తాజాగా మంగళవారం తెలంగాణలో కొత్తగా మరో ఆరు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్బీనగర్‌లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్‌మెంటఖ రద్దు చేయగా.. ఇప్పటివరకు 113 ఆసుపత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment