licence cancelled
-
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
Hyderabad: బ్లడ్ బ్యాంకుల అనుమతులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: ఎండలు ముదురుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రాకపోవడంతో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. ఫలితంగా నగరంలోని పలు రక్తనిధి కేంద్రాల్లో రక్తపు నిల్వలు నిండుకున్నాయి. దీనిని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచి్చన రోగులకు హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. బ్లడ్ బ్యాంకుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. ఈ రక్తపిశాచులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ అధికారులు అప్రమత్తమై..అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న పలు బ్లడ్ బ్యాంకులను గుర్తించి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. ఫక్తు వ్యాపారం ప్రస్తుతం గ్రేటర్లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బాం్యకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అధిక రక్త్రస్తావంతో బాధపడుతుంటారు. గర్భిణుల ప్రసవాలతో పాటు పలు కీలక సర్జరీల్లోనూ రక్త్రస్తావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికి తక్షణమే ఆయా గ్రూపుల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. డెంగీ జ్వరంతో బాధపడే వారికి తెల్లరక్తకణాలు ఎక్కించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగుల బంధువులు నమూనాలు తీసుకుని సమీపంలోని రక్తనిధి కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. రోగుల బంధువుల్లో ఉన్న బలహీనతను అక్రమార్కులు అవకాశంగా తీసుకుంటున్నారు. హోల్ బ్లడ్ సహా ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను ఆయా బ్లడ్ బ్యాంకుల సామర్థ్యానికి మించి నిల్వ చేసి, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రక్తపు కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్ రాఘవేంద్రనాయక్ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంకుల నుంచి హోల్ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు
గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా రూల్స్ అతిక్రమించిన బ్యాంక్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం.. లేదా భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. ఈ బ్యాంకుకు సరైన ఆదాయం లేకపోవడమే కాకుండా.. ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కూడా బాగా క్షిణించడంతో RBI ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో లావాదేవీలన్నీ కూడా వెంటనే నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అయితే కస్టమర్లు ఆందోళన చెందకుండా ఉండటానికి ప్రతి డిపాజిటర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి రూ.5 లక్షల బీమా క్లెయిమ్ స్వీకరించడానికి అర్హులని వెల్లడించింది. ఇదీ చదవండి: రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’.. పూర్తి వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటి సారి కాదు, గత కొన్ని రోజులకు ముందు కొల్లాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న 'శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్' లైసెన్స్ రద్దు చేస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఎ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ వంటి వాటికి భారీ జరిమానాలు విధించింది. -
హైదరాబాద్: పలు మెడికల్ షాపుల లైసెన్స్ లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్‌షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. ఇందర్‌బాగ్ కోటిలోని గణేష్ ఫార్మాసూటికల్స్, అంబర్‌పేట బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్, నాంపల్లి సర్దార్ మెడికల్ హాల్, అక్షయ మెడికల్ అండ్ జనరల్ స్టోర్, హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్(నాంపల్లి), లంగర్‌హౌజ్‌లోని ఆర్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, చార్మినార్ భారత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, హుమాయూన్‌నగర్ అల్-హమ్రా మెడికల్ అండ్ జనరల్ స్టోర్.. ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ మీరా మెడికల్ షాప్, మంగర్బస్తీ లైఫ్ ఫార్మా.. ఇలా పలు మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్‌లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది. ఇదీ చదవండి: గట్టు కోసం గొడళ్లతో గొడవ -
మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. తాగి వాహనాలు నడిపిన 5,819 మంది వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా 3,220 మంది లైసెన్సులు రద్దయ్యయాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రవాణా శాఖ తేల్చి చెప్పింది. చదవండి: TSRTC: లాభాల కిక్‌తో 2023లోకి ఆర్టీసీ.. పదేళ్లలో తొలిసారి.. -
ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు బండి నడిపేందుకు వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్సుల రద్దు ప్రక్రియ ఉత్తుత్తి ప్రహసనంగా మారింది. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం కానీ, హెచ్చరికలు రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. రద్దులోనూ జాప్యం... నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్ డ్రైవ్‌లలో పట్టుపడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు జనవరిలో పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఎం–వాలెట్లో చూడాల్సిందే... రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్ యాప్ కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్‌లో తమ డ్రైవింగ్ లైసెన్సు ఏ స్థితిలో ఉందో తెలుసుకుంటే మాత్రమే సస్పెండ్ అయినట్లుగా నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు. (చదవండి: పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..) -
ఆ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బీఐ..! అగమ్యగోచరంలో ఖాతాదారులు..!
రిజర్వ్ బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇప్పటికే నిబంధనలను పాటించని ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా వదిలిపెట్టకుండా భారీగా జరిమానాను విధించింది ఆర్బీఐ . ఇక తాజాగా ఆర్బీఐ మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా..! ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ నిబంధనలను పాటించనందున బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాదే బ్యాంకు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ ఆంక్షలను విధించింది. దీంతో ఆరు నెలల వరకు ఖాతాదారులు తమ డబ్బును విత్‌డ్రా చేసుకోనే అవకాశాన్ని కోల్పోయారు. బ్యాంకుపై ఆంక్షలు విధించినా పరిస్థితులు మారకపోవడంతో బ్యాంకు లైసెన్స్ రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకు ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అగమ్యగోచరంగా ఖాతాదారుల పరిస్థితి..! ఆర్బీఐ నిర్ణయంతో ఇండిపెండెన్స్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ ప్రతి డిపాజిటర్ DICGC చట్టం- 1961లోని నిబంధనలకు లోబడి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయల ద్రవ్య పరిమితి వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించేందుకు అర్హులని ఆర్బీఐ తెలిపింది. ఇక బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం...99 శాతం కంటే ఎక్కువ మంది డిపాజిటర్లు డిఐసిజిసి చట్టం ప్రకారం తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. చదవండి: జుకర్‌బర్గ్ కొంపముంచిన ఫేస్బుక్ యూజర్లు..! తను మునిగిపోయి.. అదానీ, అంబానీల నెత్తిన పాలు పోశాడు -
కరోనా: రాష్ట్రంలో మరో ఆరు ఆసుపత్రులపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝులిపించింది. తాజాగా మంగళవారం తెలంగాణలో కొత్తగా మరో ఆరు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్బీనగర్లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్‌మెంటఖ రద్దు చేయగా.. ఇప్పటివరకు 113 ఆసుపత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు
-
'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు
⇒ నిఖిల్‌కు శస్త్ర చికిత్స చేసిన చంద్రభూషణ్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్య ⇒ తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా శస్త్రచికిత్స చేసిన చంద్రభూషణ్ ⇒ డబ్బు కోసమే ఇలా చేసినట్లు ఆరోపణ.. ఇప్పటికీ నడవలేకపోతున్న నిఖిల్‌రెడ్డి ⇒ మరికొందరు వైద్యులపైనా చర్యలు తీసుకున్న మెడికల్ కౌన్సిల్ ⇒ సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల సస్పెన్షన్ సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంచాలంటూ తమ దగ్గరికి వచ్చిన నిఖిల్‌రెడ్డి అనే యువకుడికి.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, వైద్య ప్రమాణాలకు విరుద్ధంగా శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రెండేళ్లపాటు ఎటువంటి వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఆయనతోపాటు వైద్యవృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన మరికొందరు వైద్యులపైనా మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. సరోగసీ విధానంలో అక్రమానికి పాల్పడిన సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. తప్పుడు విధానాలు అవలంబించిన సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌కు చెందిన డాక్టర్ హరికుమార్ రవ్వా, డాక్టర్ మినాజ్ జఫర్‌లపైనా చర్యలు తీసుకుంది. శుక్రవారం మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ సమావేశానికి వైద్య విద్య డెరైక్టర్ రమణి, కాళోజీ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. నరకం చవిచూసిన నిఖిల్ హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22) సాఫ్ట్వేర్ ఇంజనీర్. తాను 5.7 అడుగుల ఎత్తున్నా కూడా మరింత పొడవు పెరగాలన్న కోరికతో.. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేస్తే ఎత్తు పెరగొచ్చని ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్ చెప్పడంతో.. శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. దీంతో నిఖిల్ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చంద్రభూషణ్ నేతృత్వంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే అప్పటికే ఇంట్లో చెప్పకుండా వెళ్లిన కుమారుడి పట్ల ఆందోళనకు గురైన నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకి గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. నిఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళన కూడా చేశారు. వైద్యుల తీరుపై అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండుకాళ్లకు శస్త్రచికిత్స చేయడంతో నెలల కొద్దీ నిఖిల్ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పటికీ మరొకరి సాయం లేకుండా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై నిఖిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపింది. చంద్రభూషణ్ నీతిబాహ్యమైన పద్ధతిలో వైద్యం చేసినట్లు గుర్తించి, రెండేళ్లపాటు వైద్య వృత్తి నుంచి బహిష్కరించింది. నిఖిల్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య నిపుణులను అతని వద్దకు పంపాలని నిర్ణయించింది. వైద్యురాలిపై ఐదేళ్ల సస్పెన్షన్ కూకట్పల్లి హౌసింగ్‌బోర్డులో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత మరో రకమైన తప్పుడు పనికి పాల్పడినట్లు మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. అమెరికాలో ఉంటున్న సుంకరి మన్మథకుమార్, చందన దంపతులు సంతానం కోసం నమ్రతను ఆశ్రయించారు. అద్దె గర్భం ద్వారా వారికి సంతానభాగ్యం కలిగించనున్నట్లు చెప్పిన నమ్రత... విశాఖపట్నం నుంచి ఒక సరోగసీ మదర్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. అయితే చందన నుంచి సేకరించిన అండానికి ఆమె భర్త వీర్య కణాలు కాకుండా... వేరే వ్యక్తికి చెందిన వీర్య కణాలతో ఫలదీకరణం చెందించి సరోగసీ మహిళ గర్భంలోకి పంపించారు. పాప పుట్టిన తరువాత అమెరికాకు తీసుకెళ్లే క్రమంలో పాస్‌పోర్టు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో ఆ దంపతులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ నమ్రత ఐదేళ్లపాటు ఎలాంటి వైద్యం చేయకుండా సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురిపై 6 నెలలు వేటు సెరెనిటీ ఫౌండేషన్ డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌లోని మైండ్క్రెస్ట్ ఆస్పత్రి వైద్యుడు హరికుమార్ రవ్వా, సమతా రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మినాజ్ జాఫర్లు మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఆ రంగంతో సంబంధం లేని నాన్ మెడికల్ సిబ్బంది ద్వారా మానసిక చికిత్సలు చేరుుంచినట్లు గుర్తించారు. దీనికి సంబందించి ఈ ముగ్గురిని ఆరు నెలల పాటు వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేశారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు జగిత్యాల సమీపంలోని ఓ గ్రామానికి చెందినవారు కడుపు నొప్పితో బాధపడుతూ డాక్టర్ టి.మనోజ్‌కుమార్‌ను ఆశ్రరుుంచారు. ఆయన వారితోపాటు సమీపంలోని మరో గ్రామానికి చెందిన కొందరికి అవసరం లేకపోరుునా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ నిర్ధారించింది. దీనికి సంబంధించి డాక్టర్ మనోజ్‌తో పాటు మరో ఏడుగురిపై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. ఇక ఎంబీబీఎస్ చదివి ఎండీగా సైన్ బోర్డు ఏర్పాటు చేసుకొన్న డాక్టర్ కృష్ణకాంత్రెడ్డిపై, ఆర్ఎంపీలుగా చలామణీ అవుతున్న కె.స్వామి, డి.రాజేశ్లపైనా చర్యలు తీసుకుంది. సీరియస్‌గా విచారణ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గత ఏప్రిల్ నుంచి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. దీనిపై 100 మందికి పైగా విచారించింది. నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల ఆవేదనను విన్నది. అనేక డాక్యుమెంట్లు సేకరించి, వైద్య వృత్తి నిబంధనలను అధ్యయనం చేసింది. ఆయా రంగాల్లో నిపుణులైన ఇతర వైద్యులనూ సంప్రదించింది. మన దేశంలో వ్యక్తుల సగటు ఎత్తు 5.5 అడుగులు. మరి నిఖిల్‌రెడ్డి 5.7 అడుగుల ఎత్తున్నాడు. అయినా ఆపరేషన్ ఎందుకు చేశారు, ఆరడుగులున్న వ్యక్తి వచ్చి మరో 4 అంగుళాలు పెంచమంటే పెంచుతారా అన్న వాదనలను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్ చేశాక నిఖిల్ నెలల కొద్దీ మంచంలోనే ఉండాల్సి వ స్తే ఎవరు బాగోగులు చూస్తారని కూడా ఆలోచించకపోవడాన్ని తప్పుబట్టింది. మొత్తంగా వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన డాక్టర్ల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైద్య వృత్తి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వైద్య విద్యా డెరైక్టర్ రమణి వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కుమిలిపోతున్నా..: నిఖిల్‌రెడ్డి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం పట్ల బాధితుడు నిఖిల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనలా ఎవరూ మోసపోకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుందన్నారు. వైద్యులపై చర్యలు తీసుకుంటూ కౌన్సిల్ ప్రకటన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను నమ్మించి మోసం చేశారు. ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నాను. ఆ రోజు డాక్టర్లు చెప్పింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. ఆపరేషన్ తర్వాత మూడు నెలల్లో యధావిధిగా నడుస్తావని డాక్టర్లు చెప్పినందుకే తల్లిదండ్రులకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. డబ్బుల కోసమే ఇలా జరిగిందని ఊహించలేకపోయాను. ఇన్ని రోజులు కుమిలిపోతున్నా..’’ అని నిఖిల్‌రెడ్డి చెప్పారు. వైద్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పోరాడి.. వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్‌పై వేటు
-
నిఖిల్ రెడ్డి కేసు: డాక్టర్‌పై వేటు
హైదరాబాద్: సంచలనం కలిగించిన నిఖిల్ రెడ్డి ఆపరేషన్ కేసులో డాక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ లైసెన్స్‌ను రెండేళ్ల పాటు రద్దు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు నెలల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్ రెడ్డి ఎత్తు పెరిగేందుకు సర్జరీ చేయించుకున్నాడు. కాగా సర్జరీ విజయవంతం కాకపోగా, ఆ తర్వాత నిఖిల్ రెడ్డి నడవలేకపోయాడు. మంచానికే పరిమితమయ్యాడు. వైద్యుల నిర్వాకంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, అతనికి పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు హెచ్ఆర్సీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆరు కేసుల్లో డాక్టర్లపై వేటు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరో ఆరు వేర్వేరు కేసుల్లో డాక్టర్లపై వేటు వేసింది. కూకట్పల్లి సృష్టి టెస్టు ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రత లైసెన్స్‌ను ఐదేళ్లు రద్దు చేస్తూ, జీవితాంతం సరోగసీ వైద్యం చేయరాదని ఆదేశించింది. మరో మూడు కేసుల్లో డాక్టర్లు రాహుల్, మినహాజ్ జాఫర్,హరికుమార్ లైసెన్స్‌లను ఆరు నెలల చొప్పున సస్పెండ్ చేసింది. మరో కేసులో జగిత్యాల జిల్లా కత్లాపూర్కు చెందిన డాక్టర్ మనోజ్ కుమార్ లైసెన్స్‌ను మూడు నెలలు రద్దు చేసింది. మరో ముగ్గురు డాక్టర్లు కృష్ణకాంత్ రెడ్డి, కే స్వామి, రాజేష్లపైనా చర్యలు తీసుకుంది.