
సాక్షి, హైదరాబాద్: మర్కజ్‌కు వెళ్లి రాష్ట్రానికి తిరిగివచ్చిన 1,000 మందిలో 925 మంది (92శాతం)ని గుర్తించామని, వీరిలో 79 మందికి కరోనా పాజిటివ్ తేలిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9 మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 435 మందిని హోం క్వారంటైన్ చేయగా, 365 మంది ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారన్నారని తెలిపారు. ఇక రాష్ట్రంలో కరోనాకు వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న వైద్యులను వ్యక్తిగతంగా అభినందిస్తూ గవర్నర్ లేఖలు పంపించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనాతో యుద్ధం చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment