రాజంపేట: రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుపై ఆశలు నెమ్మదిగా ఆవిరవుతున్నాయి. స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను పాలకలకు చూపిస్తూ రైల్వేపరంగా నందలూరుకు ఉన్న ప్రాముఖ్యతను తెలియచేసేందుకు స్ధానిక నేతలకు ఉపయోగపడింది. ఇక అదికూడా రైల్వే యాజమాన్యం లేకుండా చేసింది. వందేళ్ల కిందటి స్టీమ్‌లోకోషెడ్ బ్రిటీషు రైల్వేపాలకుల చరిత్రకు ఇన్నాళ్లు ఆనవాళ్లుగా నిలిచింది. ఇప్పుడు ఈ షెడ్‌ను రైల్వే స్క్రాప్ కింద వేలం పెట్టి తొలిగించేసింది.ఈ షెడ్ ఉంటే నందలూరు రైల్వేపరిశ్రమ ఏర్పాటు ప్రస్తావన కొనసాగుతూనే ఉంటుందనే భావనతో తొలగించినట్లు ఉందని ఉద్యమకారులు పెదవివిరిస్తున్నారు.
ఫలించని పోరాటలు.. ఉద్యమాలు
నందలూరు రైల్వేకేంద్రంలో 1880 ప్రాంతంలో బ్రిటీషు రైల్వేపాలకులు స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచి చెన్నై, గుంతకల్ వరకు రైలింజన్లతో ప్యాసింజరు, గూడ్స్‌రైళ్లను నడిపించేవారు. వందలాది క్వార్టర్స్, నివాసగృహాలతో వైభవంగా వెలుగొందింది నందలూరు. కాలానుగుణంగా ఆధునికసాంకేతికలో మార్పులు రావడంతో డీజల్, కరెంటు రైలింజన్లు రావడంతో షెడ్డ్‌లో ఉన్న 20 బొగ్గు ఇంజన్లను స్క్రాప్ కింద వేలంవేశారు. నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని పదేళ్ల కిందట అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు రైల్వే ఐక్య పోరాటసమితిగా ఏర్పడ్డారు. 70రోజుల పాటు రిలేదీక్షలు, రాస్తారోకోలు, చేశారు. యూపీఏ ప్రభుత్వహయాంలో రైల్వేమంత్రి లాలుప్రసాద్ వద్దకు వెళ్లారు. ఆయన లోక్‌సభలో వ్యాగిన్ రిపేరువర్క్‌షాపు లేదా ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ పెడతామని ప్రకటించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే..
రాజకీయదిగ్గజాలు నందలూరును సందర్శించారు. తమ ప్ర«భుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా రైల్వేపరిశ్రమను తీసుకొస్తామని హామీలు ఇచ్చారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు వెంకయ్యనాయుడు, పురందేశ్వరి, కేంద్రమంత్రులు సందర్శించివెళ్లారు. సర్వే, స్ధలనివేదికలు బుట్టదా ఖాలా అయ్యాయి.
ఎంపీ మిథున్‌రెడ్డి అలుపెరగని కృషి..
నందలూరుకు పూర్వవైభవం తీసుకురావాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తన శక్తిమేరకు కృషిచేస్తూనే ఉన్నారు. అనేక మార్లు రైల్వేమంత్రులను కలిసి వినతులు సమర్పించారు. సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, తమ ప్రాంతా లకు రైల్వేపరిశ్రమను తీసుకెళ్లేం దుకు జరుగుతున్న పరిణామాల్లోనే నందలూరుకు రైల్వేపరిశ్రమ రాని వ్వకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment