ముంబై: రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త తరం డేటా వేర్‌హౌస్ అయిన సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (సీఐఎంఎస్–సిమ్స్)ను ఆవిష్కరించింది. ముందుగా కమర్షియల్ బ్యాంకులు దీనికి రిపోర్టింగ్ చేయడం మొదలుపెడతాయని, ఆ తర్వాత అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకూ దీన్ని వర్తింపచేస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో 17వ స్టాటిస్టిక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ప్రజలకు మరింత డేటాను అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర యూజర్లు ఆన్‌లైన్‌లో గణాంకాలపరమైన విశ్లేషణ చేపట్టేందుకు కూడా కొత్త సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుందని దాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment