న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లస్సీపురాలో కలర్ కోటెడ్ ఉక్కు తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల టన్నులుగా ఉండనుంది. గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్‌లోని స్థానిక మార్కెట్లో విక్రయాల కోసం స్టీల్ శాండ్‌విచ్ ప్యానెల్స్, స్టీల్ డోర్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. స్థల కేటాయింపు పత్రాలను హోం మంత్రి అమిత్ షా సోమవారం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌కు అందిం చారు. స్థానిక వ్యాపారాలు, సమాజానికి ఈ ప్లాంటు ప్రయోజనం చేకూర్చగలదని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని జిందాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment