సాక్షి,విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉద్యోగులు షాకిచ్చారు. 500 మంది ఉద్యోగుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నం చేసింది. ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను పంపుతున్నట్లు సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల ఇంటర్వ్యూలు కోసం 4 బృందాలు ఏర్పాటు చేసింది.
కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేందుకు ముందుకు రాలేదు. యాజమాన్యం నిర్వహించిన ఇంటర్వ్యూలకు కనీసం 20 మంది ఉద్యోగులు కూడా హాజరు కాలేదు. అయితే, ప్లాంట్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని చెప్పి ప్రైవేట్ హోటల్స్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించడం కొసమెరుపు
చదవండి : మీకో దణ్ణం చంద్రబాబు : ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment