సాక్షి,విశాఖపట్నం : విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఎఫ్ 1ను మూసేసిన ప్లాంట్ అధికారులు.. తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్లాంట్‌లోని వరుస పరిణామలపై అటు ఉద్యోగులు.. ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు నిలిపివేసి.. కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌లో కార్యకలాపాలు నిర్వహించడంపై కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ఉక్కు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..ఉద్యోగుల జీతాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు.
ఇప్పటి వరకు రెండు బ్లాస్ట్ ఫర్నెస్ లు నడిపితే అరకొరగా ఉత్పత్తి.. ఇకపై ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ తోనే ఉత్పత్తితో కేవలం నెలకు రూ. వెయ్యి కోట్లు మాత్రమే రాబడి వస్తుందని, ఇలా అయితే ప్లాంట్ నిర్వహణ అసాధ్యమని స్టీల్ ప్లాంట్ కమిటీ సంఘాలు నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment