సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు.
చదవండి: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్.. పట్టించుకోలేదని ఆగ్రహం..
Comments
Please login to add a commentAdd a comment