సాక్షి,హైదరాబాద్: మరో సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగులకు హ్యాండిచ్చింది. హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ఆన్ పాసివ్ టెక్నాలజీస్ ఉద్యోగులు సోమవారం(జులై 22) ఆందోళనకు దిగారు. కంపెనీపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కంపెనీలో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు.
జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పది సంవత్సరాల అనుభవం ఉంది. పే స్లిప్, పీఎఫ్ సరిగా లేకపోవడంతో వేరేచోట ఉద్యోగాలు ఇవ్వట్లేదని ఉద్యోగులు వాపోయారు. జీతాలడిగితే కంపెనీ యాజమాన్యం ఈరోజు రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు.
తమ జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు చెల్లిస్తే విధులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ డబ్బులు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment