పవన్ కల్యాణ్ పేరిట పూజలు చేసిన శ్రీజ | Sreeja pray for the janasena cheaf pavan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పేరిట పూజలు చేసిన శ్రీజ

Published Thu, Sep 3 2015 2:31 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

పవన్ కల్యాణ్ పేరిట పూజలు చేసిన శ్రీజ - Sakshi

పవన్ కల్యాణ్ పేరిట పూజలు చేసిన శ్రీజ

భద్రాచలం : భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరిట పాల్వంచకు చెందిన బండి శ్రీజ తల్లిదండ్రులతో వచ్చి బుధవారం పూజలు నిర్వహించారు.  శ్రీజకు బ్రెయిన్ మలేరియా సోకటంతో గతేడాది ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. కోమా స్థితిలో ఉన్న ఆ బాలిక  కోరిక మేరకు గతేడాది సెప్టెంబర్ 10న పవన్ కల్యాణ్ ఖమ్మం వచ్చి ఆమెను పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడిన తరువాత వారు హైదరాబాద్ వెళ్లి పవన్‌ను కూడా కలిశారు. కాగా, బుధవారం పవన్ పుట్టిన రోజు కావటంతో  తనలాంటి వారికి పవన్ అండగా నిలవాలని పూజలు చేసినట్లుగా బాలిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement