టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలసిందే. అయితే మంగళవారం కాలు బెణకడంతో భీమవరంలో పవన్ విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన ముచ్చటించారు. తమను పోలీసులు ఇబ్బంది పెడ్తున్నారని, బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు.
బాలకృష్ణ తుపాకీతో కాల్చిన .. పవన్ సంచలన వ్యాఖ్యలు
Published Wed, Jul 25 2018 10:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement