
సాక్షి, తిరుపతి: బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఒకలా.. రాష్ట్ర నాయకత్వం మరోలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష