
సాక్షి, హైదరాబాద్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వైజాగ్, విజయనగరం, విజయవాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలో ప్రజల్నికలవనున్నారు. బుధవారం విశాఖలో పవన్ మొదటగా పర్యటించనున్నారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో ఉద్యోగిగా పని చేస్తూ ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులుతో మరోసారి భేటీ కానున్నారు. ఫెర్రీ బోట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఒంగోలులో ఈ నెల 8న కలుసుకోనున్నారు.