
పవన్‌కు స్వాగతం పలుకుతున్న నాయకులు
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : హైదరాబాద్ నుంచి కర్నూల్‌లోని ఆలూరు వద్ద జరిగిన క్వారీలో జరిగిన ప్రమాధ ఘటన గురించి తెలుసుకునేందుకు సోమవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ షాద్‌నగర్ మీదుగా వెళ్లారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూల్ వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు, అభిమానులు సోమవారం తెల్లవారుజామున 5గంటలకు పెద్ద ఎత్తున షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్దకు చేరుకొని ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా షాద్‌నగర్ జనసేన పార్టీ నాయకులు జర్పుల రాజు నాయక్, ఎండీ ఆష్రఫ్‌ల ఆధ్వర్యంలో నాయకులు పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో అధినేత పవన్ కళ్యాణ్ ముచ్చటించారు.
త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమతో వెల్లడించినట్లు నాయకులు రాజు నాయక్, ఆష్రప్‌లు తెలిపారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు సవాళ్ల వినోద్, రఫీ, దాసరి చిన్న, షకీల్, పవన్, రహమత్, భరత్, శ్రీను, శేఖర్, ప్రవీన్, రమేష్, రాజు, కుమార్, ప్రసాద్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment