సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అశ్చర్యకరమైనది కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాబుకు బీటీమ్ లాంటి పార్టీ జనసేన అని అన్నారు. ‘‘వీరిద్దరూ కలిసే వస్తారని మేం ముందే చెప్పాం. వారి చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదు. తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు. టీడీపీ, జనసేనలు వేర్వేరుగా ఎప్పుడూ లేవు’’ అని మంత్రి అన్నారు.
‘‘11 మంది మరణాలపై మాట్లాడకపోడం దారుణం. మరణాలకు పోలీసులు కుట్ర చేశారంటూ బుద్ధిలేని ఆరోపణలు. బీజేపీతో ఉంటూ చంద్రబాబుతో కలవడానికి పవన్‌కు సిగ్గులేదా?. చంద్రబాబుతో కలవడానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చిందా?. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను కదపలేరు. ఈ పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ప్రజల ప్రాణాల పరిరక్షణ కోసమే జీవో నంబర్ 1 తీసుకువచ్చాం. నిబంధనల ప్రకారం ఎవరైనా సభలు నిర్వహించుకోవచ్చు’’ అని మంత్రి అంబటి అన్నారు.
చదవండి: జీ హుజుర్.. చంద్రబాబుతో పవన్ భేటీ అందుకే..
Comments
Please login to add a commentAdd a comment