సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన సత్తెనపల్లెలో మీడియాతో మాట్లాడుతూ, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు. చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఏ పార్టీకి విశ్వాసం లేని వ్యక్తి నాపై పోటీకి దిగుతున్నాడు. ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్‌పైనా పోటీ చేస్తున్నారు. పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు. విశ్వాస ఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లి ప్రజలను కోరుతున్నా’’ అని మంత్రి అంబటి పిలుపునిచ్చారు.
‘‘చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది. చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి?. రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు. భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది. చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నాడు. చంద్రబాబు, పవన్‌లకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం’’ అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment