సాక్షి, కాకినాడ జిల్లా: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని దుష్ప్రచారం చేయించిన బాబు.. కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘సీఎం జగన్ ఒక వాస్తవిక వాది.. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నాయకుడు’ అని కన్నబాబు అన్నారు.
‘‘తన రాజకీయ అవసరాల కోసం తుని రైలు దగ్ధం కేసును చంద్రబాబు వాడుకున్నాడు. కాపులను సంఘ విద్రోహ శక్తులగా చూపించే ప్రయత్నం చేశాడు. సంబంధం లేని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. ఆకలి కేకల పేరుతో రోడ్లు మీదకు వచ్చి కంచాలు కొట్టిన మహిళలపైనా కేసులు పెట్టారు.’’ అని ఆయన ధ్వజమెత్తారు.
చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర?
‘‘ముద్రగడను చూసేందుకు వచ్చిన చిరంజీవిని రాజమండ్రి ఎయిపోర్టులో నిర్భంధించి వెనక్కి పంపారు. వేలాది మంది కాపులపై చంద్రబాబు బనాయించిన అక్రమ కేసులను ఎత్తేసిన చరిత్ర సీఎం జగన్‌ది. కాపు నేస్తం పథకం ద్వారా కాపులలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు’’ అని కురసాల కన్నబాబు అన్నారు.
చదవండి: బాలకృష్ణ అల్లుడి పాదయాత్ర.. టీడీపీలో చిచ్చు రాజేస్తోందా?
Comments
Please login to add a commentAdd a comment