Tuni case
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని దుష్ప్రచారం చేయించిన బాబు.. కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం సృష్టించి ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘సీఎం జగన్ ఒక వాస్తవిక వాది.. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నాయకుడు’ అని కన్నబాబు అన్నారు. ‘‘తన రాజకీయ అవసరాల కోసం తుని రైలు దగ్ధం కేసును చంద్రబాబు వాడుకున్నాడు. కాపులను సంఘ విద్రోహ శక్తులగా చూపించే ప్రయత్నం చేశాడు. సంబంధం లేని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. ఆకలి కేకల పేరుతో రోడ్లు మీదకు వచ్చి కంచాలు కొట్టిన మహిళలపైనా కేసులు పెట్టారు.’’ అని ఆయన ధ్వజమెత్తారు. చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?.. ఇంకెన్నాళ్లు ఈ మొద్దునిద్ర? ‘‘ముద్రగడను చూసేందుకు వచ్చిన చిరంజీవిని రాజమండ్రి ఎయిపోర్టులో నిర్భంధించి వెనక్కి పంపారు. వేలాది మంది కాపులపై చంద్రబాబు బనాయించిన అక్రమ కేసులను ఎత్తేసిన చరిత్ర సీఎం జగన్‌ది. కాపు నేస్తం పథకం ద్వారా కాపులలో ఉన్న పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు’’ అని కురసాల కన్నబాబు అన్నారు. చదవండి: బాలకృష్ణ అల్లుడి పాదయాత్ర.. టీడీపీలో చిచ్చు రాజేస్తోందా? -
ముద్రగడపై చర్యలకు హైకోర్టులో పిటిషన్
రాజమండ్రి : కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తుని ఘటన కేసులో ముద్రగడపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ముద్రగడ నిర్వహించనున్న పాదయాత్రను ఆపాలని ఆయన తన పిటిషన్లో కోరారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి చేసిన ద్రోహానికి నిరసనగా నవంబర్ 16 నుంచి ఐదు రోజుల పాటు ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. -
కాపు ఉద్యమ చీలికపై ప్రభుత్వం కుట్ర
-
తుని ఘటనపై కాపునేత మెహర్ పై సీఐడి విచారణ
-
ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
-
ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో తమ జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన తమ జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చాం, ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుకు, కాపులకుమధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. తమను బెదిరించినా, ఎంత అప్రజాస్వామ్య పద్ధతులు పాటించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, తాను ఒత్తిళ్లు, భయాలకు లొంగే మనిషిని కానని.. తన జీవితంలో భయమంటే ఏంటో తెలియదని ఆయన కుండ బద్దలుకొట్టారు. కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని.. అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. రేపు ఉదయం మళ్లీ రమ్మని పిలిచారని, విచారణకు హాజరవుతానని భూమన తెలిపారు. -
తుని కేసులో నలుగురికి బెయిల్
తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో అరెస్టయిన వారిలో నలుగురు నిందితులకు పిఠాపురంలోని జిల్లా కోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. మరో ముగ్గురికి కాకినాడలోని సీబీసీఐడీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. కురాకుల పుల్లయ్య(విరవాడ), చక్కపల్లి సత్తిబాబు(ధర్మవరం), లగుడు శ్రీనివాసు(కోతనందురు), పి.శ్రీహరిబాబు (కోలంక)లను పోలీసులు తుని ఘటన కేసులో ఈ నెల 7న అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరు పరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వీరు బెయిల్ కోసం పిఠాపురంలోని జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... శుక్రవారం కోర్టు బెయిలు మంజూరు చేసింది. అలాగే, ఇదే కేసులో అరెస్ట్ అయిన నల్లా విష్ణుమూర్తి (అమలాపురం), రామకృష్ణ(గోపాలపురం), వాసిరెడ్డి ఏసుదాసు (కాకినాడ)లు కాకినాడలోని సీబీసీఐడీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు శుక్రవారం వాటిని కొట్టివేసింది. పిఠాపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన లగుడు శ్రీనివాసును సీఐడీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కాకినాడలోని సీబీసీఐడీ కోర్టు మేజిస్ట్రేట్ శశాంకర్ ఆదేశించారు.