ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో తమ జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన తమ జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చాం, ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
Published Tue, Sep 6 2016 5:56 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement