Kurasala Kannababu Serious Comments On BJP And Somu Veerraju, Details Inside - Sakshi
Sakshi News home page

సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు పద్దతి కాదు: కన్నబాబు ఫైర్‌

Published Sun, Feb 19 2023 4:48 PM | Last Updated on Sun, Feb 19 2023 5:29 PM

Kurasala Kannababu Serious Comments On BJP And Somu Veerraju - Sakshi

సాక్షి, కాకినాడ: బీజేపీ రాజకీయాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం ‍వ్యక్తం చేశారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయంలో ఆలయాలను కూలిస్తే బీజేపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. 

కాగా, కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని మతాలను గౌరవిస్తారు. తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారు. మానవసేవే.. మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజీయం చేస్తో​ంది. సునీల్‌ ధియోధర్‌ ట్వీట్‌ చాలా అవమానకరంగా ఉంది. చంద్రబాబు హయంలో 40 ఆలయాలను కూల్చివేశారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారు?. ప్యాబ్రికేటెడ్‌ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్క్‌ అవుట్‌ కాదు. 

సీఎం జగన్‌.. అర్చకులకు ఆర్ధిక సహయం అందించడం నుండి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఆలయాల్లో వైభవం తీసుకువచ్చారు. మీ ఒక్కరికే హిందుత్వం మీద ప్రేమ ఉందా?. సోము వీర్రాజుకు రాజకీయాలు చేయాలను కుంటే ఇది పద్దతి కాదు. సునీల్‌ ధియోధర్‌ వంటి నాయకులను పెట్టుకుని ఏపీ రాజకీయాలు చేస్తే ఇంకా దిగిజారిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement