సీప్లేన్ సర్వీసులపై వైఎస్సార్‌సీపీ నేత కన్నబాబు
విఫల ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని చంద్రబాబు సరికొత్త ‘షో’
అమరావతి చుట్టూ అద్భుతం జరిగిపోతోందని నమ్మించే యత్నం
సాధ్యాసాధ్యాలపై సర్వే లేదు.. పర్యావరణ అనుమతులూ లేవు
సాక్షి, అమరావతి: విజయవాడ – శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసుల వ్యవహారం చూస్తుంటే అమరావతి చుట్టూ అద్భుతాలు జరిగిపోతున్నాయని ప్రజలను నమ్మించడానికే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దేశంలో పలు చోట్ల విఫలమైన ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు సరికొత్త ‘షో’కు తెర తీశారన్నారు.
‘అసలు ఆవ గింజంత అయితే కొసరు గుమ్మడికాయంత’ అన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చి పీక్‌లోకి వెళ్లిందని దెప్పి పొడిచారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని గ్రాఫిక్స్ లాగే సీప్లేన్ ప్రాజెక్టు కూడా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ప్రభుత్వం తెరపైకి తెచి్చందని స్పష్టమవుతోందన్నారు. శ్రీశైలంకు సీప్లేన్ సర్వీసుల సాధ్యాసాధ్యాలపై ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఎటువంటి పర్యావరణ అనుమతులూ లేవని చెప్పారు. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సీప్లేన్ సేవలు విఫలమయ్యాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment