
కాకినాడ రూరల్: తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తామంటున్న టీడీపీ నేతలకు దమ్ముంటే మహానేత విగ్రహాన్ని తాకి చూడాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సవాల్ చేశారు. ప్రజలు 2019లోనే టీడీపీని బంగాళాఖాతంలోకి విసిరేశారని వ్యాఖ్యానించారు.
తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆ పార్టీ నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులతో కలసి కన్నబాబు సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో కుట్రపూరితంగా కంట్రోల్ రూమ్ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని క్రేన్లతో తొలగించడంతో మీ బతుకు 23 సీట్లకే పరిమితమైంది. మేం అధికారంలోకి వచ్చాక అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించాం.
► వైఎస్సార్ అంటే వ్యక్తి కాదు.. ఈ రాష్ట్రంలో ఒక శక్తి. వైఎస్సార్ పుణ్యమాని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందామని, పిల్లల్ని ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివించగలిగామని ఇవాళి్టకీ ప్రజలు గడప గడపకూ కార్యక్రమంలో చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఏం ఒరిగిందో ఒక్కటైనా చెప్పుకునే దమ్ము ఉందా? సాక్షాత్తూ ఎన్టీఆర్నే పార్టీ నుంచి తొలగించిన ఘనత మీది.
► ఎన్టీఆర్పై నిజంగానే అభిమానం ఉంటే 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క జిల్లాకైనా ఆయన పేరు పెట్టారా? వెన్నుపోటుకు ప్రాయశి్చత్తంగా ఎన్టీఆర్కు కనీసం భారతరత్న ఇవ్వాలని అడిగారా? హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చారని మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు పోలవరం, ఆరోగ్యశ్రీ పేర్లను మార్చలేదా?
► పాదయాత్ర పేరుతో ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రేకెత్తిస్తున్నారు. మహిళలు తొడ కొట్టడం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment