సాక్షి, కృష్ణా: నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోందన్నారు.
చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. బాబు హయాం నుంచి చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు కన్నబాబు. చివరికి కుప్పం నుంచి గెలవలేని పరిస్థితి చంద్రబాబుదని కన్నబాబు తేల్చేశారు.
‘‘బాబు పాలనలో కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి. చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే!.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే’’ అని కురసాల పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేసిన కురసాల కన్నబాబు.. దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అని అభివర్ణించారు. తనను మించిన మహానటుడు చంద్రబాబు అని స్వయానా ఎన్టీఆరే అన్నారని, చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని కన్నబాబు పేర్కొన్నారు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని, సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్ ఉందా? అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. ‘అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. పాదయాత్రలో లోకేష్ భాష, బాడీలాంగ్వేజ్ అసభ్యకరంగా ఉంది. ఓర్వలేనితనంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్ తన భాషను అదుపులో పెట్టుకుంటే మంచిద’ని కన్నబాబు టీడీపీ జాతీయ కార్యదర్శికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment