సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు.
కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు.
ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment