
కాకినాడ రూరల్/సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో వ్యవసాయాభివృద్ధిలో రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే)లు కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ‘అరటి సాగు – ప్రాముఖ్యత’అనే అంశంపై జూమ్ యాప్ ద్వారా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు, అధికారులు, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలతో పాటు ఆర్‌బీకేల్లో రైతులు పాల్గొన్నారు.
కన్నబాబు మాట్లాడుతూ.. నూతన వంగడాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఉద్యాన పంటలకు హబ్‌గా రాయలసీమ అభివృద్ధి చెందాలని, ఈ దిశగా రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించే నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment