సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా ఎల్లో మీడియా ఆణిముత్యాలు ఏరుకుంటోంది. పచ్చి అబద్దాలను వండి వారుస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై నారా లోకేశ్ ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అని ప్రశ్నించారు.
లోకేశ్ పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు?
కాగా, కురుసాల కన్నబాబు ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ఓ గజదొంగ. అవినీతిలో పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయాడు. కోర్టులను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం బాబుకు అలవాటే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ముడుపులు చేరాయి. చిన్న చిన్న ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదు?.
స్పందించే దమ్ము లేకుంటే దొరికిపోయినట్టే..
అమరావతి లంచాల కోసం నిర్మించింది. అమరావతి పేరుతో అవినీతివతిని నిర్మించాలనుకున్నాడు. చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీని నాశనం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. చంద్రబాబు గ్యారెంటీలు, ష్యూరిటీలను ప్రజలు ఎప్పుడో చూసేశారు. ఇంతా జరుగుతున్నా ఎల్లో మీడియా మాత్రం స్పందించడం లేదు. ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. చెప్పే దమ్ము లేకుంటే దొరికిపోయినట్లు అర్థం. 2014లో ఇచ్చిన 600 హమీలకు దిక్కు లేదు. ఇప్పుడు మేం మీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తాం అంటున్నాడు. మూడు లేక నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటున్నాడు. దానిని హమీ అంటారా? అంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులతో చంద్రబాబుకు హైటెన్షన్
Comments
Please login to add a commentAdd a comment