
ప్రధాని మోదీ పర్యటనలో విభజన హామీలు నెరవేరుతాయని ఆశిస్తున్నానని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ పర్యటనలో విభజన హామీలు నెరవేరుతాయని ఆశిస్తున్నానని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, రెండు పొత్తులున్న పార్టీ నాయకులు కలవడంలో ప్రాధాన్యత ఏముందని ప్రశ్నిస్తూ.. ప్రధానితో పవన్ భేటీకి ఏ మాత్రం కూడా ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు.
కేంద్రం ఏమిచ్చింది.. పాచిపోయిన లడ్డు అన్న పవన్ కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదన్నారు. మూడేళ్లలో ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కోసం సీఎం జగన్.. ప్రధానిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేశారని కన్నబాబు గుర్తు చేశారు.
చదవండి: సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు