సాక్షి, కాకినాడ జిల్లా: ఉన్నది ఉన్నట్లు చెప్పే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనకు నాటకాలు తెలియదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కన్నబాబు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అమరావతిలో రాజధాని కొనసాగుతుందా.. లేదా?.. మీరు కోరుకునే రాజధాని రావడం లేదని ఎందుకంత బాధ? అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అందుకే మూడు రాజధానులు కావాలని మేం కోరుతున్నాం. రాజధానికి 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని వైఎస్ జగన్ అంటే, చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా ప్రైవేట్ భూములను లాక్కున్నారు’’ అని కన్నబాబు మండిపడ్డారు.
చదవండి: విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
అమరావతే బాగుండాలని మీరు అనుకున్నప్పుడు, మేం బాగుండాలని కోరుకునే హక్కు ఉత్తరాంధ్ర, రాయలసీమకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని కుట్ర చేస్తున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అమరావతి మాత్రమే బాగుండాలని టీడీపీ, ఎల్లో మీడియా కోరుకుంటోంది. అందుకే దుష్ఫ్రచారం చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా చెప్పినట్టు మేం ఆడాలా’’ అంటూ కన్నబాబు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment