మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్‌కు 10 కిలోల పంపిణీ | Hyderabad: Civil Supplies Provided Freerice To Ration Card Holders | Sakshi
Sakshi News home page

మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్‌కు 10 కిలోల పంపిణీ

Published Tue, Jul 5 2022 9:30 AM | Last Updated on Tue, Jul 5 2022 2:52 PM

Hyderabad: Civil Supplies Provided Freerice To Ration Card Holders - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్‌) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు  పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్‌ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో  నెల సరి కోటాతో సంబంధం లేకుండా  యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు.

ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా  నెలసరి ఉచిత కోటా  ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. 

గత రెండేళ్ల నుంచి.. 
కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం  కింద ఉచిత  కోటా కేటాయిస్తూ  అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం  కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి  పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో  కేంద్రం మరోసారి సెప్టెంబర్‌ వరకు పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌న్‌ నెలల్లో ఉచిత  బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం  నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది.

చదవండి: పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement