
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్ వేళ పట్టెడన్నం కోసం ఎందరో ఆరాటపడుతున్నారు. వలస కూలీలు, రోడ్ల వెంట నివసిస్తున్న వారు, యాచకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. శేరిలింగంపల్లిలో శుక్రవారం కొందరు దాతలు ఆహారం పొట్లాలు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేయగా..అది తీసుకున్న ఆనందంలో ఓ యువతి ఇలా... (ఆపరేషన్ మార్కెట్)
ఆశయమే శ్వాసగా..
కోవిడ్ విజృంభిస్తున్న వేళ రెడ్‌జోన్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ వర్కర్లు క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పలువురు నర్సులు, ఆశ వర్కర్లు మలక్‌పేట పరిధిలో రెడ్‌జోన్ ప్రకటించిన కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.