పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష
Published Tue, Nov 22 2016 3:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. అలాగే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరపై కూడా అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశానికి కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమోయ్‌కుమార్, పౌరసరఫరాల శాఖాధికారులు హాజరయ్యారు.
Advertisement
Advertisement