ఈ సమ్మర్లో ఐస్ క్రీంలు..కొంచెం ఖర్చెక్కువే
ఈ సమ్మర్లో ఐస్ క్రీంలు..కొంచెం ఖర్చెక్కువే
Published Sun, Feb 26 2017 10:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
ఐస్క్రీమ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి... వేసవికాలంలో అలా చల్లచల్లగా ఓ ఐస్క్రీమ్ తింటే చాలు, మొత్తం కూల్ అయిపోతాం. అందుకే అన్ని కాలాల్లో కన్నా వేసవిలో దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ తిన్నాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందేనట. ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారీ ఖర్చులు గతేడాది కంటే ఈ ఏడాది బాగానే పెరిగిపోయాయట. ఐస్ క్రీమ్లో వాడే స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్ ధర గతేడాది కేజీకి రూ.140 ఉంటే, ప్రస్తుతం రూ.240కు ఎగిసింది. అంతేకాక ఐస్క్రీమ్ తయారీకి వాడే మరో కీ పదార్థం చెక్కర ధరలు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది కంటే ఈ ధరలు 30 నుంచి 40 శాతం పెరగడంతో కంపెనీలకు ఐస్ క్రీమ్ ఇన్ఫుట్ కాస్ట్లు పెరిగిపోయాయట.
దీంతో దేశంలోనే అతిపెద్ద ప్లేయర్, అమూల్ ఐస్ క్రీమ్లు అమ్మే గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) ఐస్ క్రీం ధరలను 5-8 శాతం పెంచేసింది. మరో లీడింగ్ సంస్థ వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా ఈ ధరలను 6 నుంచి 8 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. రెండు ప్రధాన పదార్థాలు మిల్క్ సాలిడ్స్, షుగర్ ధరలు పైకి ఎగియడంతో తమ తయారీఖర్చు సగటున 5-6 శాతం పెరిగినట్టు వాదిలాల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గాంధీ చెప్పారు. మదర్ డైరీ కూడా ఐస్ క్రీమ్ ధరలను 5 శాతం పెంచుతోంది. మొత్తంగా తయారీఖర్చులు పెరిగిపోవడంతో ఐస్ క్రీమ్ ధరలను పెంచనున్నామని కంపెనీలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement