vadilal
-
ఎవరీ వడిలాల్ గాంధీ?.. రోడ్డుపక్కన ప్రారంభమై వేల కోట్ల సామ్రాజ్యాన్ని..
ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన సంస్థలన్నీ ఒకప్పుడు చిన్న కంపెనీలుగా ప్రారంభమైనవే. ఈ కోవకు చెందిన వాటిలో ఒకటి 'వడిలాల్ ఐస్‌క్రీమ్' కంపెనీ. ఈ కంపెనీ ఫౌండర్ 'వడిలాల్ గాంధీ'. ఇంతకీ ఈయన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మధ్యతరగతి కుటుంబానికి చెందిన 'వడిలాల్ గాంధీ' 1907లో అహ్మదాబాద్‌లోని ఒక చిన్న ఫౌంటెన్ సోడా దుకాణం ప్రారంభించారు. ఆ తరువాత సోడా విక్రయించడం ప్రారంభించారు. క్రమక్రమంగా.. గుజరాత్లో ఈయన దుకాణానికి ఆదరణ పెరిగింది. ఆ తరువాత సోడాతో పాటు ఐస్‌క్రీమ్ విక్రయించడం ప్రారంభించారు.వడిలాల్ గాంధీ ప్రారంభించిన ఐస్‌క్రీమ్ షాప్ బాగా అభివృద్ధి చెందింది. 1926లో ఈయన దేశంలోనే మొట్టమొదటి ఐస్‌క్రీమ్ అవుట్లెట్ స్థాపించారు. ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని విస్తరించడానికి అప్పట్లో జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత వడిలాల్ గాంధీ కుమారుడు రాంచోడ్ లాల్ గాంధీ వ్యాపార బాధ్యతలు చేపట్టారు.1970 నాటికి అహ్మదాబాద్‌లో మొత్తం 10 వడిలాల్ అవుట్లెట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అప్పట్లో రాంచోడ్ లాల్ కుమారులు రామచంద్ర, లక్ష్మణ్ గాంధీలు నిర్వహించారు. నేడు ఈ కంపెనీ భారతదేశంలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. గతంలో ఈ కంపెనీ వండిన కూరలు, రొట్టెలు మొదలైన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని విక్రయించింది.ప్రస్తుతం వడిలాల్ కుటుంబానికి చెందిన ఐదవ తరం వ్యక్తి 'కల్పిత్ గాంధీ' కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఐస్‌క్రీమ్ విక్రయిస్తూ ప్రజాదరణ పొందుతోంది.1907లో ఓ వీధి దుకాణంగా ప్రారంభమైన వడిలాల్ కంపెనీ నేడు ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అయిపోయింది. ప్రస్తుతం వడిలాల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 30,00,00,00,000. దీన్నిబట్టి చూస్తే.. వీధి పక్కన ఓ చిన్న షాపుగా ప్రారంభమై నేడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. -
Success Story: 9వ తరగతి ఫెయిలైనా రూ.1900 కోట్ల కంపెనీకి ఓనర్..
రాజేష్ గాంధీ (Rajesh Gandhi).. వాడిలాల్ ఇండస్ట్రీస్ (Vadilal Industries) చైర్మన్. 1979లో కంపెనీలో చేరిన నాలుగో తరం వ్యాపారవేత్త. తన ఆధ్వర్యంలో 90వ దశకంలో వాడిలాల్ కోల్డ్-చైన్ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తూ ప్రాసెసెడ్ ఆహార పరిశ్రమలోకి ప్రవేశించింది. చదువే అన్నింటికీ పరమార్థం కాదు. చదువులో వెనుకబడినవారు కూడా తమదైన రంగంలో అద్భుత విజయాలు సాధించగలరని చెప్పడానికి రాజేష్ గాంధీ ఒక ఉదాహరణ. ఈ ప్రముఖ ఐస్ క్రీం కంపెనీని 1907లో వాడిలాల్ గాంధీ స్థాపించారు. ఇది అహ్మదాబాద్‌లోని ఒక చిన్న వీధి సోడా దుకాణంతో ప్రారంభమైంది. 2023 సెప్టెంబర్ 18 నాటికి వాడిలాల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,843 కోట్లుగా ఉంది. 9వ తరగతి ఫెయిల్ రాజేష్ గాంధీ తన పాఠశాల విద్యను అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో చదివారు. అయితే తాను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యానని ఒకసారి ఫార్చ్యూన్ ఇండియాతో మాట్లాడుతూ రాజేష్ గాంధీ చెప్పారు. ఆ స్కూల్లో ఫెయిలైన తాను బయటకు వెళ్లి మరో స్కూల్లో 10వ తరగతిలో చేరాలనుకోగా దానికి తన తండ్రి ఒప్పుకోలేదని, పట్టుబట్టి మరీ తనను ఆ స్కూల్లోనే మరో సంవత్సరం 9వ తరగతి చదివించాడని గుర్తు చేసుకున్నారు. వాడిలాల్ కంపెనీ పలు ఫ్లేవర్లతో కోన్లు, క్యాండీలు, బార్లు, కప్పులు, ఫ్యామిలీ ప్యాక్‌లతో సహా అనేక రూపాల్లో ఐస్క్రీంను తయారు చేస్తోంది. కంపెనీ సూపర్ మార్కెట్లు కాకుండా దాని ఫ్రాంఛైజ్ ఆధారిత హ్యాపిన్నెజ్ ఐస్ క్రీం పార్లర్ల ద్వారా రిటైల్ అమ్మకాలు సాగిస్తోంది. 1990వ దశకంలో బాగా స్థిరపడిన కోల్డ్ చైన్ నెట్వర్క్ని ఉపయోగించి ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిశ్రమలోకి ప్రవేశించిన వాడిలాల్ కంపెనీ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించింది. 1972-73 వరకు అహ్మదాబాద్‌లో వాడిలాల్ కంపెనీకి 8 నుంచి 10 అవుట్లెట్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత క్రమంగా గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు, 1985 నాటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలకు విస్తరించింది. నేడు వాడిలాల్ భారతదేశంలోని ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటిగా నిలిచింది. -
ఈ సమ్మర్లో ఐస్ క్రీంలు..కొంచెం ఖర్చెక్కువే
ఐస్‌క్రీమ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి... వేసవికాలంలో అలా చల్లచల్లగా ఓ ఐస్‌క్రీమ్ తింటే చాలు, మొత్తం కూల్ అయిపోతాం. అందుకే అన్ని కాలాల్లో కన్నా వేసవిలో దీనికి డిమాండ్ ఎక్కువ. కానీ ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ తిన్నాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాల్సిందేనట. ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారీ ఖర్చులు గతేడాది కంటే ఈ ఏడాది బాగానే పెరిగిపోయాయట. ఐస్ క్రీమ్‌లో వాడే స్కిమ్డ్ మిల్క్ ఫౌడర్ ధర గతేడాది కేజీకి రూ.140 ఉంటే, ప్రస్తుతం రూ.240కు ఎగిసింది. అంతేకాక ఐస్‌క్రీమ్ తయారీకి వాడే మరో కీ పదార్థం చెక్కర ధరలు కూడా భారీగానే పెరిగాయి. గతేడాది కంటే ఈ ధరలు 30 నుంచి 40 శాతం పెరగడంతో కంపెనీలకు ఐస్ క్రీమ్ ఇన్‌ఫుట్ కాస్ట్‌లు పెరిగిపోయాయట. దీంతో దేశంలోనే అతిపెద్ద ప్లేయర్, అమూల్ ఐస్ క్రీమ్‌లు అమ్మే గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) ఐస్ క్రీం ధరలను 5-8 శాతం పెంచేసింది. మరో లీడింగ్ సంస్థ వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా ఈ ధరలను 6 నుంచి 8 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. రెండు ప్రధాన పదార్థాలు మిల్క్ సాలిడ్స్, షుగర్ ధరలు పైకి ఎగియడంతో తమ తయారీఖర్చు సగటున 5-6 శాతం పెరిగినట్టు వాదిలాల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గాంధీ చెప్పారు. మదర్ డైరీ కూడా ఐస్ క్రీమ్ ధరలను 5 శాతం పెంచుతోంది. మొత్తంగా తయారీఖర్చులు పెరిగిపోవడంతో ఐస్ క్రీమ్ ధరలను పెంచనున్నామని కంపెనీలు చెబుతున్నాయి.