పాల ధర మళ్లీ పెరిగింది..
రూ.2 పెంచిన అమూల్, మదర్ డెయిరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మళ్లీ పాల ధరలు పెరిగాయి. భారత్‌లో దిగ్గజ బ్రాండ్ అయిన అమూల్ లీటరుకు రూ.2 పెంచింది. ఈ పరిణామంతో వెంటనే మదర్ డెయిరీ సైతం లీటరుకు రూ.2 అధికం చేసింది. దీంతో ఈ బ్రాండ్ల టోన్డ్ మిల్క్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ.40కి చేరింది. ప్రస్తుతం నందిని బ్రాండ్ టోన్డ్ మిల్క్‌ను కర్నాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లీటరుకు రూ.36కు విక్రయిస్తుండగా, ప్రభుత్వ కంపెనీ అయిన విజయ రూ.38కి అమ్ముతోంది. ప్రైవేటు కంపెనీలు రూ.40 ఆపై ధరలోనే విక్రయిస్తున్నాయి. ధర విషయంలో అమూల్, మదర్ డెయిరీ బాటలో మిగిలిన కంపెనీలు నడుస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.