
పాప కోసం మ్యాచ్ ఆపిన రఫెల్!
మల్లోర్కా: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్ ల జోడి మల్లోర్కా లో బుధవారం ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. ఆ సమయంలో నాదల్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలోనే అలజడి. తన పాప కనిపించడం లేదంటూ ఓ తల్లి ఆవేదన. ఆ పాప కోసం స్టేడియం అంతా కలియ తిరుగుతుంది. ఆ పాపం కోసం వెతుకుతోంది.
అయితే సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పట్టించుకోరు. మరి రఫెల్ నాదల్ మ్యాచ్ ను ఆపేశాడు. ఆ తల్లి పాపకోసం పడుతున్న బాధను తనకు జరిగిన నష్టంగా భావించిన నాదల్ స్టేడియం వైపే తన దృష్టిని కేంద్రీకరించాడు. ఇది ఏ కొద్ది సేపటికో పరిమితం కాలేదు. ఆ పాపను తల్లి చేరేవరకూ నాదల్ అలానే ఉండిపోయాడు. చివరకు ఆ పాప-తల్లి కూతుళ్లు కలవడంతో నాదల్ ఊపిరి పీల్చుకున్నాడు.