విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి | Sunrisers Hyderabad vs Rajasthan Royals IPL 2015 Match | Sakshi
Sakshi News home page

విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి

Apr 16 2015 2:41 PM | Updated on Sep 3 2017 12:20 AM

విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి

విశాఖలో మళ్లీ క్రికెట్ సందడి

దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖపట్నంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు

నేడు సన్‌రైజర్స్‌తో రాజస్తాన్ మ్యాచ్
 సాక్షి, విశాఖపట్నం: దాదాపు ఆరు నెలల తర్వాత విశాఖపట్నంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. ఐపీఎల్-8లో భాగంగా నేడు (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. హుదూద్ తుపాన్ కారణంగా అక్టోబర్ 14న భారత్, వెస్టిండీస్‌ల మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ రద్దయిన తర్వాత మళ్లీ క్రికెట్ జరుగుతుండటంతో అభిమానులు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తున్నారు.
 
 దీంతో మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం పూర్తిగా నిండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే స్మిత్ సారథ్యంలోని రాజస్తాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోరుమీదుంది. కెప్టెన్ షేన్ వాట్సన్ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగే అవకాశాల్లేవు. మరోవైపు సన్‌రైజర్స్ ఒక దాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడింది. గత మ్యాచ్‌లో బెంగళూరుపై విజయంతో సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసంతో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement