
మ్యాచ్‌లో గుండెపోటు
క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలోనే గుండెపోటుకు గురి కావడంతో నమీబియాకు చెందిన రేమండ్ వాన్ స్కూల్ ఆస్పత్రిపాలయ్యాడు.
ఐసీయూలో నమీబియా క్రికెటర్
విన్‌డోక్ (నమీబియా): క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలోనే గుండెపోటుకు గురి కావడంతో నమీబియాకు చెందిన రేమండ్ వాన్ స్కూల్ ఆస్పత్రిపాలయ్యాడు. నమీబియా, ఫ్రీ స్టేట్ జట్ల మధ్య జరిగిన లిస్ట్-ఎ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తున్న 25 ఏళ్ల రేమండ్ అకస్మాత్తుగా విరామం కోరాడు.
తనకు ఏదోలా అవుతుందంటూ మంచినీళ్లు అడిగాడు. కొన్ని నీళ్లు తాగగానే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో సహచరులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఐసీయూలో చికిత్స జరుపుతున్నట్లు క్రికెట్ నమీబియా సీఈఓ డొనోవాన్ వెల్లడించారు. రేమండ్ ఇప్పటివరకు 92 ఫస్ట్‌క్లాస్, 103 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.