న్యూఢిల్లీ: ఎవరైనా బౌలర్ మ్యాచ్‌లో సందేహాస్పద బౌలింగ్ వేస్తున్నట్టుగా అనుమానిస్తే అంపైర్లు వెంటనే కెప్టెన్‌ను పిలిచి అతడిని తప్పించేలా...
న్యూఢిల్లీ: ఎవరైనా బౌలర్ మ్యాచ్‌లో సందేహాస్పద బౌలింగ్ వేస్తున్నట్టుగా అనుమానిస్తే అంపైర్లు వెంటనే కెప్టెన్‌ను పిలిచి అతడిని తప్పించేలా చూడాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించారు. అలాంటి బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన తర్వాత అంపైర్లు రిపోర్ట్ చేస్తే ఫలితం ఉండదని అన్నారు. ‘మ్యాచ్ ముగిశాక బౌలర్ శైలిపై రిపోర్ట్ చేయడం సరికాదు. ఒకవేళ అతడి బౌలింగ్‌పై అసంతృప్తిగా ఉంటే వెంటనే కెప్టెన్‌ను పిలిచి బౌలింగ్ వేయకుండా చూడాలి. ప్రస్తుతానికైతే భారత జట్టులో ఇలాంటి బౌలర్లు లేరు. దేశవాళీల్లో కొందరు తమ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది’ అని గవాస్కర్ చెప్పారు.