
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు.
‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment