valmiki maharshi
-
వాల్మీకి మహర్షికి జగన్ నివాళి..
-
అదిగో అయోధ్య... అల్లదిగో అయోధ్య
రాముడు శ్రీరాముడు సకల గుణాభిరాముడు రాఘవుడు... ఇన్ని నామాంతరాలు ఉన్న ఆ దశరథ రాముడు... ఆ రోజున తెల్లవారుజామునే మేల్కొన్నాడు... సరయూ జలాలలో అభ్యంగన స్నానం ఆచరించాడు... అల్లలాడుతున్న అలకలను సరిచేసుకున్నాడు...సూర్య వంశ చిహ్నంగా నుదుటన రవి తిలకం ధరించాడు రవికులుడు... చల్లని వెన్నెలలు చిలకరించే రాజీవాక్షాలకు నల్లని కాటుక అలదాడు..సీతమ్మకు ఆనవాలుగా పంపిన అంగుళీయకాన్ని వేలికి ధరించాడు... తన పట్టాభిషేక సమయానికి సిద్ధం చేయించిన వస్త్రాలు ధరించాడు.. నాడు భరతుడు సింహాసనం మీద ఉంచి పరిపాలన కొనసాగించిన పాదుకలలో పాదాలుంచాడు... బాల్యంలో చందమామ కావాలి అని మారాము చేసినప్పుడు అద్దంలో చందమామను చూపిన ఆ అద్దంలో ఇప్పుడు ఈ రామచంద్రుడు తన ముఖ బింబాన్ని చూసుకుని... చిరునవ్వులు చిందిస్తూ... గడప దాటి బయటకు అడుగు పెట్టబోతున్నాడు... సరిగ్గా అదే సమయానికి... గుమ్మం ముందర కవి సమూహం లోపలకు వస్తూ కనిపించారు. వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి, లోపలకు ఆహ్వానించి, సముచిత స్థానాలు చూపి, ఆసీనులను చేసి, తాను కూడా గౌరవముద్రలో సింహాసనం అధిరోహించాడు.. అందరూ విశ్రాంతులైన పిదప... ‘వాల్మీకి మహర్షీ! మహానుభావులంతా ఒక్కసారే విచ్చేశారు. కారణం తెలుసుకోవచ్చా’ అని వినమ్రంగా ప్రశ్నించాడు. వాల్మీకి తన గుబురు శ్మశ్రువుల మాటు నుంచి చిన్నగా నవ్వుతూ, ‘ఏమయ్యా! నువ్వు ఇంత తొందరగా ఏదో పని మీద బయలుదేరినట్టున్నావు. విషయం తెలుసుకోవచ్చా’ అన్నాడు ఏమీ ఎరగనట్లు. ‘మహర్షీ! ఏమీ ఎరగనట్లు ప్రశ్నిస్తున్నారు. మీరే కదా నా కథను లవకుశల ద్వారా గానం చేయించి ప్రపంచానికి పరిచయం చేసింది. నాకు ఎంతటి మంచి లక్షణాలు ఉండాలో కూడా మీరే నిర్దేశించారు కదా. అటువంటి మీకు నేను ఎప్పుడు, ఎక్కడకు వెళ్తానో తెలియదా. నా నోటితో చెప్పించాలనే ఆలోచన కాకపోతేను’ అన్నాడు వాల్మీకి మహర్షితో చనువుగా. ‘నాకు తెలుసు రామా! నీ వినయం, విధేయత, గౌరవం... అన్నీ. ఈ రోజు ఇక్కడకు వచ్చినవారిని గమనించావా. వీరంతా నీ కథను ఇన్ని వేల సంవత్సరలుగా సజీవంగా ఉంచిన మహానుభావులు. నేను రాసిన కథను యథాతథంగా ఉంచకుండా, వారికి తోచిన కల్పనలు కూడా చేశారు. వీరందరికీ నువ్వంటే ప్రీతి. అందుకే వారి మనసుకి నచ్చిన విధంగా నిన్ను కీర్తించారు. నిన్ను నెత్తిన పెట్టుకుని నేటికీ ‘రామాయణం’ అనే కావ్యాన్ని ‘రామ’ అనే తారక మంత్రాన్ని ఇంకా పచ్చిగా, లేతగా, తడి ఆరకుండా ఉంచారు... అని వాల్మీకి పారవశ్యంతో పలుకుతుంటే, రాముని శరీరం పులకించిపోయింది. రామా! నీకు ఒక్కొక్కరినీ మరోసారి పరిచయం చేస్తాను. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్లే సంతోషంలో ఉన్నావు. అందువల్ల నేను పరిచయం చేస్తేనే కాని వారిని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోలేవు.... అంటూ పండిత పరిషత్తు వైపునకు తల పరికించాడు. ఇదిగో మొట్టమొదటగా చెప్పవలసిన వ్యక్తి కాళిదాసు. ఈయన కవికుల గురువు. నీ గొప్పదనాన్ని ‘రఘువంశం’ అనే కావ్యంగా వెలయించాడు. మీ కుటుంబాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతించాడో తెలుసా. ఆ కవిత్వమంతా ఇప్పుడు చెప్పనులే. రేఖామాత్రంగానే పరిచయం చేస్తాను. ఇక ఆ పక్కన కూర్చున్న కవి భవభూతి. ఉత్తర రామ చరిత రచించి అందరి కంట నీరు పెట్టించాడు. ఆ పక్కనే ఉన్న భాసుడు ‘ప్రతిమ’ అనే నాటకాన్ని రచించాడు. ఆయనకు నా రామాయణంలోని కొన్ని విషయాలు నచ్చలేదు. అందుకని ఆయన కొన్ని కల్పనలు చేశాడు.కైకేయి దుర్బుద్ధికాని, లక్ష్మణుడు అవాచ్యకాలు పలకలడం కాని ఇందులో కనపడదు. దశరథ ప్రతిమా కల్పనం, దశరథ శ్రాద్ధ కలనం వంటి కొన్ని అంశాలు ఇందులోని కొత్త విషయాలు. అర్థమైందా ఈ కవి విలక్షణత. ఆయనకు కైకమ్మను నిందించాలనిపించలేదు. సరే – ఇంక ఆ పక్కన చూడు... మురారి. ఆయనకు నా పేరు కూడా చేరింది. బాల వాల్మీకి అని పిలుస్తారు. ఎన్నో గురుకుల క్లేశాలు అనుభవించి, చివరకు కవికులంలో స్థానం సంపాదించాడు. ఆ మహానుభావుడు.. నీ తండ్రి దశరథుడిని ఎంత గొప్పగా ప్రశంసించాడో తెలుసా. ఆయనట ఏకంగా దిక్పాలకులను తన ఇంటి ముంగిట్లో బంధించేశాడు. అంటే వారికి పని లేకుండా నీ తండ్రి గారే ముల్లోకాలను సుభిక్షంగా పరిపాలించాడట. అబ్బో ఈ కవి గురించి ఎంత చెప్పినా చాలదు. ఆయన మార్గమే వేరు. నీకు ముందు ముందు ఇటువంటి మార్గంలో వెళ్లిన మరో ఇద్దరిని గురించి చెబుతానులే. ఇక తెలుగు కవులలోకి వస్తే... అబ్బో... బోలెడు మంది.. తెలుగులో ఆది కావ్యం రచించిన నన్నయ మొదలుగా నిన్నమొన్నటి ఉషశ్రీ వరకు ఎంత మంది ఎంత అందంగా నీ కావ్యాన్న రచించారో. కవిత్రయంలో మొదటివాడైన నన్నయభట్టు మహానుభావుడు భారత ఆంధ్రీకరణేకాకుండా నీ కథను ‘రాఘవాభ్యుదయం’ పేరిట తెలుగువారికి అందించాడు. ఆ కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ పేరున తొట్టతొలి ప్రబంధ కావ్యాన్ని, ఒక్క వచనం కూడా లేకుండా పూర్తి పద్యంలో రచించాడు. కవిత్రయంలో మూడవ వాడైన ఎరన్ర కూడా రామాయణం కావ్యాన్ని రచించాడు. ఇక మంత్రి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’, కుమ్మరి మొల్ల ‘మొల్ల రామాయణం’, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ రచించారు. వారంతా నీ పట్ల ప్రేమానురాగాలను కురిపిస్తున్న కన్నులతో ఎంత భక్తిగా కూర్చున్నారో చూడు. ఇక వీరందరిదీ ఒక ఎత్తయితే... ఆ మురారిలాగే నిరంకుశుడైన కవి ‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ’. ఆ మహానుభావుడు నీ క్రీగంటి చూపు కోసం చూస్తున్నాడు. అటు వైపుగా ఒక్కసారి నీ తల త్రిప్పు. ఈయన నీ కథను ‘రామాయణ కల్పవక్షం’ పేరున రచించి, తెలుగులో మొట్టమొదటి జ్ఞానపీఠ సత్కారాన్ని అందుకున్నాడు. ఇంకా ఎన్నో సత్కారాలు ఉన్నాయిలే. నిన్ను తనకు కావలసిన విధంగా ప్రస్తుతించుకున్నాడు. ఇక ఈ సభకు హాజరైన చివరివాడు ‘ఉషశ్రీ’. మురారి పంథాలో విశ్వనాథ కావ్యరచన చేస్తే, ఆ విశ్వనాథ చేత ‘ఇది ఉషశ్రీ మార్గము’ అనిపించుకుని, నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగాడు. వాడు త్యాగ్య వాగ్గేయకారుడైతే, వీడు వాక్కావ్యకారుడు. తన నోటితో నీ కథను అందంగా చెబుతూ, తన కలంతో కూడా అంతే అందంగా నిన్ను ప్రస్తుతించాడు. ఇంతమంది కవులు నీ కోసం నిరీక్షిస్తుంటే... నువ్వు నీ బాల రామ ప్రతిష్ఠ కోసం పరుగులు తీయడం న్యాయమేనా. అందుకే నిన్ను లోపలకు పిలిచాను. వీరందరికీ నీ తియ్యని ఆశీర్వచనాలు కావాలి.. అంటూ వాల్మీకి పలుకుతుంటే... మరో నలుగురు పరుగుపరుగున లోపలకు ప్రవేశించారు. వారిలో ప్రథముడు కంచర్ల గోపన్న... అయ్యా! వాల్మీకి మహర్షీ! నన్ను మరచిపోతే ఎలాగయ్యా.. అంటూ పాదాల మీద వాలాడు. వాల్మీకి ఆ గోపన్నను దగ్గరగా తీసుకుని, ‘రామభద్రా! వీడు నీ కోసం భద్రాద్రిలో ఆలయం నిర్మించాడు. నీ పేరున కీర్తనలు రచించి, గోపన్న నామాన్ని రామదాసుగా మార్చుకున్నాడు. నీ కోసం కారాగారం పాలయ్యాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అయితేనేం, నీ గురించి ఎన్నో మంచి మంచి కీర్తనలు రచించాడు... అంటుంటే, రామదాసు శ్రీరాముని పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. ఇదిగో ఈ మహానుభావుడిని చూడు. ఈయన త్యాగయ్య. నీ మీద ఎన్ని కీర్తనలు రచించాడు. ‘మా జానకి చెట్టపట్టగా మహరాజువైతివి’ అని ఆ తల్లి సీతమ్మను తన గుండెల్లో పొదివిపట్టుకున్నాడు.. అని త్యాగయ్య గురించి పలుకుతుంటే, ఆ మహానుభావుడు తన చేతిలోని తంబురను శ్రీరాముని చేతికిచ్చాడు. ఆ రాముడు తన విల్లును పక్కన పెట్టి, తంబురనే విల్లుగా ధరించాడు. అంతే ఆ దశ్యం చూసిన కొంటె బొమ్మల బాపు... గబగబ అయిదు నిమిషాలలో కవుల కొలువును, తంబుర రాముడిని తన రేఖలలో నింపేశాడు. ఆ పక్కన ముసిముసి నవ్వులతో బాపుని అంటిపెట్టుకున్న ముళ్లపూడి రమణ.. శ్రీరామా! ఓ ఫైవ్ లెటర్స్ అప్పు ఇస్తావా నిన్ను పొగడటానికి... అంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లాడు. ఈసారి రాముడు కాదు, వాల్మీకి పరవశించిపోయాడు. నేను 24 వేల శ్లోకాలతో రామకథను కొన్ని వేల సంవత్సరాల క్రితం రచిస్తే, నేటికీ నా రాముడిని అందరూ అక్షరాలలో బంధిస్తూనే ఉన్నారు. ‘రామా! ఇది నా గొప్పతనం కాదు. ఇది నీ గొప్పదనం. నీ వ్యక్తిత్వ ఔన్నత్యం. నీ తండ్రి దశరథుడు నేర్పిన సంస్కారం గొప్పదనం.మా జన్మలు ధన్యమయ్యాయయ్యా. ఇక నువ్వు నీ బాల విగ్రహ ప్రతిష్ఠ చూడటానికి బయలుదేరు. మేమంతా నీ వెంట వస్తాం. అక్కడ అయోధ్యలో ‘రామాయ రామభద్రాయ రాచంద్రాయ వేధసే’ అంటూ రామాయణ గాథ ఉషశ్రీ గళం వినిపిస్తున్నారట. ‘మన ఉషశ్రీ ధన్యుడయ్యాడు. నీ ఎదుట గళం వినిపించే అదృష్టం అతడిని మాత్రమే వరించింది. అతడి మాటలలోనే నా ఉపన్యాసం ముగిస్తాను. స్వస్తి’ అంటూ వాల్మీకి ముగింపు పలికాడు. అందరూ నెమ్మదిగా అయోధ్య వైపుగా బయలుదేరబోతున్నారు. చకచక అడుగులు వేస్తూ ఉషశ్రీ వేగంగా వెళ్లడం గమనించిన రాముడు, ‘మహర్షీ! మనం కూడా బయలుదేరాలయ్యా. వాడు కాలాంతకుడు. సమయ పాలన వాడి ఆత్మ. నా బాలరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కదా. ఆ వ్యాఖ్యానం వీడి గళం నుంచే వెలువడబోతోంది. వాడితో పాటు వాడికి ‘ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా ఉండాలి’ అని మార్గదర్శనం చేసిన జమ్మలమడక మాధవరామ శర్మ కూడా ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడు. వేగంగా పదండి’ అని పలికాడు. అదిగో అయోధ్య. అదిగో రాముడు. అదిగో మన కవిపండితులు. అదిగో మన తెలుగువారు. జై శ్రీరామ్... (జనవరి 22, 2024 సోమవారం నాడు బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సృజన రచన. - డా. పురాణపండ వైజయంతి) -
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్‌ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్ ఆస్వాదించారు. అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి. అయోధ్యలో రామ్‌లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్‌లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు. వికాస్.. విరాసత్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్ (అభివృద్ధి)తో పాటు విరాసత్ (వారసత్వం) కూడా ముఖ్యమే. అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్‌ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మెగా రోడ్ షో శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్‌షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. రోడ్‌షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద కాసేపు గడిపారు. ఆ రోజు రాకండి ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు. వాలీ్మకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్ దీవికి బ్రిటిష్ చెర నుంచి సుభాష్ చంద్రబోస్ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్ కాల్లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. విమానాశ్రయ విశేషాలు.. ► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు. ► బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు. ► ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. ► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ► ఈ ఎయిర్‌్రస్టిప్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది. ► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చాలా సులువు. రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ► రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైలు సేవలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్‌ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్‌లు, కదిలే మెట్లు, ఫుడ్ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్ కేర్, వెయిటింగ్ హాళ్లతో స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి సరి్టఫికెట్‌నూ ఈ రైల్వేస్టేషన్ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్ భారత్ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. -
నేడు అయోధ్యకు మోదీ.. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(శనివారం) ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో పర్యటించనున్నారు. రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. నగరాన్ని పూలతో అలంకరించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు.6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’ అనే పేరు ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా వ్యవహరించేవారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సరీ్వస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో రూ.15,700 కోట్ల కంటే విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్లు ఖర్చు చేస్తుండగా..ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. -
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
ఘనంగా వాల్మికీ జయంతి వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు విభాగము, మలేషియా తెలుగు సంఘాలు సంయుక్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. అందులో భాగంగా సుందరకాండ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే అంశంపై వర్చువల్ సదస్సు నిర్వహించారు. సుమారు 20 దేశాలకు చెందిన వారు ఈ వేడుకల్లో భాగమయ్యారు. సమాజ శ్రేయస్సు కొరకు ఉచితంగా నిర్వహించిన ఈ దీక్షా కార్యక్రమానికి తితిదే ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిధి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రామాయణం మానవాళికి మార్గనిర్దేశనమన్నారు. త్రేతాయుగం నాటి రామాయణాన్ని నేడు ప్రతి ఒక్కరూ అనుసరించేలా మహర్షి వాల్మీకి రచించారని చెప్పారు. విశిష్టఅతిధిగా హాజరైన ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణమే మానవ జీవన పారాయణమన్నారను. భారతీయ సనాతధర్మం విశిష్టతను రామయణం ద్వారా వాల్మీకి మహర్షి జాతికి తెలియజేశారన్నారు. -
అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
-
అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ‘మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుంది. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి నేడు. రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. కాగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్న జిల్లాను గుర్తిం చి రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించాలని, ఇందుకోసం అనంతపురం జిల్లాకు రూ.19లక్ష లు కేటాయించగా..ఇతర జిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు. -
బోయ రత్నాకరుడే.. మహర్షి వాల్మీకి
త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్టతో తపస్సు చేస్తుండేవాళ్లు. వీరిలో ప్రచస్థాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని అటుగా వెళ్తున్న ప్రయాణిస్తున్న ఓ వేటగాడు గమనించాడు. ఆ ముని కుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకెళ్లిన బోయవాడు తన కుమారునిగా పెంచుకుంటాడు. తన కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి మరణించి ఉంటాడని ప్రచస్థాముడు భావిస్తాడు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. యుక్త వయస్సుకు వచ్చిన రత్నాకరుడికి ఓ యువతితో వివాహమవుతుంది. వీరికి ముగ్గురు సంతానం. వీరితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి వెనుకాడని పరిస్థితికి చేరుకుంటాడు రత్నాకరుడు. అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ మనిషి రూపంలో ఆ దారి వెంట వస్తాడు. ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నంచగా.. తన వద్ద వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెడుతాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిస్తాడు. పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే. పాప పుణ్యాలు నాకు తెలియవని అంటాడు. రత్నాకరుడికి జ్ఞానోదయం కలిగించేందుకు నారదుడు ఓ ఉపాయం పన్నుతాడు. ఓ బోయవాడా.. నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్తాడు. తన పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, అందుకు వారు సమ్మతించరు. పైగా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత.. పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం, తీసుకోలేమని బదులిస్తారు. వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపి భక్తి మార్గానికి ‘రామ.. రామ‘ అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేస్తాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు వెలుస్తాయి. అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని రత్నాకరుని చెవిలో రామ.. రామ.. రామ.. అని నారదుడు మూడుసార్లు పలుకుతాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు. ‘‘రత్నాకరా.. నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు. దేవుడు నిన్ను కరుణిచాడు. నీవు మళ్లీ జన్మించావు. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావు’’ అని దీవించి నారదుడు అదృశ్యమవుతాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణ సంకలనం చేస్తాడు. సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కావడంతో రామయాణాన్ని ఆదికావ్యం అంటారు. ఇకపోతే వాల్మీకి మొదటి శిష్యులు రాముడి కుమారులైన లవకుశలు. నేడు రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు అనంతపురం: మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు ఆదివారం అనంతపురంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం రూ.19లక్ష లు కేటాయించగా..ఇతరజిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు. మం త్రులు శంకరనారాయణ, గుమ్మనూరు జయరాం, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, రెడ్డెప్ప, డాక్టర్ సంజీవకుమార్, పి.బ్రహ్మానందరెడ్డితో పాటు పలు వురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో ఉదయం 10 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్న జిల్లాను గుర్తిం చి రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించడం పట్ల ఆ వర్గీయులు గర్వపడుతున్నారు. రామాయణంతోనే కుటుంబ వ్యవస్థ పటిష్టం భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే అది రామాయణంతోనే. పితృవాక్య పరిపాలన. ఒకే భార్య, ఒక బాణం, ఒకే మాట అనేది రామాయణం నుంచి వచ్చిం దే. అలాంటి ఆది కావ్యాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలకు అనంతపురం వేదిక కావడం సంతోషదాయకం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. బీసీల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలుస్తారు. – తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ -
‘వాల్మీకి’ సినిమా టైటిల్ మార్చాలి
సాక్షి, తాండూరు: వాల్మీకి మహర్షి పేరును ఓ ఫ్యాక్షన్ సినిమాకు పెట్టడం సరికాదని, వెంటనే సినిమా టైటిల్ మార్చాలని తాండూరు వాల్మీకి సంఘం నాయకులు ఆదివారం తాండూరు డీఎస్పీ రామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. వాల్మీకి సినిమా టైటిల్ ఉపయోగించి ఫ్యాక్షన్ సినిమాను తీస్తున్న తెలుగు సినిమా డైరక్టర్, హీరో, నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్మీకి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమిళ సినిమా ‘జిగర్తాండ’ను తెలుగులో అనువాదం చేస్తున్నారని, సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ తో ఉందని, ఇలాంటి సినిమాకు వాల్మీకి మహర్షి పేరు పెట్టడం సరికాదన్నారు. వెంటనే సినిమా పేరు మార్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కథలప్ప, నర్సింలు, తిరుపతి, మహేష్ బోయ లక్ష్మణ్, బోయ అశోక్‌కుమార్, గోపాల్, అనిల్ తదితరులున్నారు. -
బతుకునిచ్చిన నగరం
ఉత్తర భారతదేశం నుంచి నిజాం జామానాలో ఇక్కడకు వలస వచ్చిన మెహదరులు శ్రవుజీవులు. ఆదివాసీ జాతికి చెందిన మెహదరులు పూర్వకాలంలో కొండలు, గుట్టల్లో నివసించేవారని, వాల్మీకి మహర్షి వీరితో సహవాసం చేశారని ప్రతీతి. అందుకే వీరు వాల్మీకిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో వాల్మీకి జయుంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరం తమకు బతుకునిచ్చిందని గర్వంగా చెబుతారు. శారీరక దారుఢ్యం గల మెహదరులను సైన్యంలో చేర్చుకుంటామని చెప్పి అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్‌కు రప్పించారు. నిజాం పిలుపుతో పది పదిహేను కుటుంబాల మెహదరులు ఉత్తరాది నుంచి ఎడ్లబళ్లపై దాదాపు ఆరు నెలలు ప్రయూణం సాగించి ఇక్కడకు చేరుకున్నారు. ఇలా వచ్చిన వారికి సుల్తాన్షాహిలోని బిస్తీవాడి, చుడీబజార్లోని జీన్సీబోరాహి, గౌలిగూడ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి ఆశ్రయుం కల్పించారు. అరుుతే, నిజాం ప్రభువులు తొలుత చెప్పినట్లుగా సైన్యంలో చేర్చుకోకుండా, వీరికి పారిశుద్ధ్య పనులను అప్పగించారు. అప్పటి నుంచి వారు పారిశుద్ధ్య పనులనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్నా, చాలా వుంది సులభ్ కాంప్లెక్సుల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ పనులు చేస్తున్నారు. కొందరు జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులుగా కొనసాగుతున్నారు. నగరంలోని సుల్తాన్షాహి, లలితాబాగ్, ఉప్పుగూడ, రాజనర్సింహ కాలనీ, మీర్పేట్, సరూర్‌నగర్, ఉప్పల్, అంబర్పేట్, గోల్నాక, రావుంతపూర్, గౌలిగూడ, కార్వాన్, లంగర్‌హౌస్, ఫస్ట్ ల్యాన్సర్, నింబోలి అడ్డా, అశోక్‌నగర్, మారేడ్‌పల్లి, అల్వాల్, బొల్లారం, కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మది వరకు మెహదరుల జనాభా ఉంది. కట్నం డివూండ్ చేస్తే కుల బహిష్కరణే ఆచారాలను, సంప్రదాయూలను కాపాడుకుంటున్న మెహదరులలో వరకట్న దురాచారం లేదు. ఒకవేళ ఎవరైనా కట్నం డివూండ్ చేస్తే వారికి కుల బహిష్కరణ తప్పదని వాల్మీకి మహాసభ సభ్యుడు సురేందర్ సింగ్ పార్చా చెప్పారు. పెళ్లి తర్వాత కొత్త జంటలు స్వస్థలమైన హర్యానా వెళ్లి, అక్కడి పాత్రీ, గుర్గావ్ దుర్గావూత ఆలయూలను దర్శించుకుంటారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీరుుంచేందుకు కూడా వాల్మీకులు హర్యానా వెళతారు. హర్యానాలోని వాల్మీకి సవూజ్ నేతృత్వంలో ఏపీ వాల్మీకి వుహాసభ, తెలంగాణ వాల్మీకి యువజన మహాసభలతో పాటు వివిధ ప్రాంతాల్లో బస్తీల వారీగా వాల్మీకి సవూజ్లు ఏర్పాటు చేసుకుని పండుగలు, వేడుకలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రవూలనూ వీరు నిర్వహిస్తున్నారు. హుందాతనానికి చిహ్నంగా హుక్కా మెహదరులకు ఉదయుం లేవగానే హుక్కాతాగడం తరతరాలుగా వస్తున్న అలవాటు. హుక్కాను వీరు హుందాతనానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటికి వచ్చే అతిథులకు సైతం హుక్కా అందించి వుర్యాద చేస్తారు. వివిధ రకాల మూలికలను ముద్దగా చేసి, నిప్పురవ్వల్లో వేసి, హుక్కా సేవిస్తామని సురేందర్ సింగ్ పార్చా చెప్పారు. ఆస్తవూ నివారణకు హుక్కా సేవనాన్ని ఆయుుర్వేద ఔషధంగా భావిస్తావుని ఆయున వివరించారు. పారిశుద్ధ్య పనుల్లో యూజమాన్య హక్కు కల్పించాలి పారిశుద్ధ్య పనుల్లో మెహదరులకు యూజవూన్య హక్కులు కల్పించాలి. సులభ్ కాంప్లెక్స్‌ల నిర్వహణ బాధ్యతలను మెహదరులకే అప్పగించాలి. టెండర్లు వేయుకుండా స్థానికులకే అవకాశం కల్పించాలి. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు మజూరు చేయూలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలలో మార్జిన్ వునీని 20 శాతం వరకు, సబ్సిడీని 50 శాతం వరకు పెంచాలి. ఉత్తర భారతదేశంలో వూదిరిగానే ఇక్కడ కూడా మెహదరుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య, స్కాలర్షిప్లు కల్పించాలి. అన్ని కులాల వూదిరిగానే తహసీల్దారు కార్యాలయుం నుంచే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేయూలి. వాల్మీకి, అంబేద్కర్ ఆవాస్ యోజన కింద శాశ్వత గృహ నిర్మాణాలను చేపట్టాలి. - ప్రవీణ్ బాగ్డీ, తెలంగాణ వాల్మీకి యుువ మహాసభ ప్రధాన కార్యదర్శి