
సాక్షి, తాండూరు: వాల్మీకి మహర్షి పేరును ఓ ఫ్యాక్షన్ సినిమాకు పెట్టడం సరికాదని, వెంటనే సినిమా టైటిల్ మార్చాలని తాండూరు వాల్మీకి సంఘం నాయకులు ఆదివారం తాండూరు డీఎస్పీ రామచంద్రుడికి ఫిర్యాదు చేశారు. వాల్మీకి సినిమా టైటిల్ ఉపయోగించి ఫ్యాక్షన్ సినిమాను తీస్తున్న తెలుగు సినిమా డైరక్టర్, హీరో, నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్మీకి సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. తమిళ సినిమా ‘జిగర్తాండ’ను తెలుగులో అనువాదం చేస్తున్నారని, సినిమా పూర్తిగా ఫ్యాక్షన్ తో ఉందని, ఇలాంటి సినిమాకు వాల్మీకి మహర్షి పేరు పెట్టడం సరికాదన్నారు. వెంటనే సినిమా పేరు మార్చాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కథలప్ప, నర్సింలు, తిరుపతి, మహేష్ బోయ లక్ష్మణ్, బోయ అశోక్‌కుమార్, గోపాల్, అనిల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment